coronavirus : 9 రాష్ట్రాలు ,4 కేంద్రపాలిత ప్రాంతాలలో రికవరీ 90 శాతం కంటే ఎక్కువ

coronavirus : 9 రాష్ట్రాలు ,4 కేంద్రపాలిత ప్రాంతాలలో రికవరీ 90 శాతం కంటే ఎక్కువ
x
Highlights

కరోనా గణాంకాలు దేశానికి నిరంతరం ఉపశమనం కల్గిస్తున్నాయి. శుక్రవారం 62 వేల 104 కొత్త కేసులు నమోదు కాగా.. 70 వేల 386 మంది రోగులు నయమయ్యారు. 839 మంది...

కరోనా గణాంకాలు దేశానికి నిరంతరం ఉపశమనం కల్గిస్తున్నాయి. శుక్రవారం 62 వేల 104 కొత్త కేసులు నమోదు కాగా.. 70 వేల 386 మంది రోగులు నయమయ్యారు. 839 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఎనిమిది లక్షల కన్నా తక్కువకు వచ్చాయి.. దేశంలో మొత్తం 7 లక్షల 94 వేల మంది రోగులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 74.34 లక్షల కేసులు నమోదు అయితే.. తొమ్మిది రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలలో 90 శాతం కంటే ఎక్కువ మంది రోగులు కోలుకున్నారు, ఇది జాతీయ సగటు 87.8 శాతం కంటే ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది.

మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ సంఖ్య 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ కూడా రికవరీ రేటు ఉందని తెలిపింది. మరోవైపు రాబోయే రెండున్నర నెలలు చాలా కీలకమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ శుక్రవారం అన్నారు. పండుగ సీజన్ తోపాటు.. చలికాలం నేపథ్యంలో జలుబు సంక్రమణకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.. అటువంటి పరిస్థితిలో, మనందరికీ కరోనా ప్రివెన్షన్ విషయంలో అవగాహన అవసరం అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories