క్రియాశీల కరోనా గణాంకాలు విడుదల.. తెలుగు రాష్ట్రాల స్థానాలు..

క్రియాశీల కరోనా గణాంకాలు విడుదల.. తెలుగు రాష్ట్రాల స్థానాలు..
x
Highlights

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రియాశీల కరోనా కేసుల గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలో 74 శాతం క్రియాశీల కేసులు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రియాశీల కరోనా కేసుల గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలో 74 శాతం క్రియాశీల కేసులు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులు దేశంలోని 9 రాష్ట్రాల్లో ఉన్నారు. రోగులలో గరిష్టంగా 28శాతం మహారాష్ట్రకు చెందినవారు కాగా.. కర్ణాటక 11శాతం తో రెండవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నాయి, ఇక్కడ 10శాతం క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇవే కాకుండా, 7శాతం కేసులు ఉత్తర ప్రదేశ్‌లో, 5శాతం తమిళనాడులో, 4శాతం ఒడిశాలో, 3శాతం తెలంగాణ, 3శాతం అస్సాం మరియు ఛత్తీస్‌గడ్ లో ఉన్నాయి. మిగిలిన 26శాతం మంది రోగులు దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు. ప్రస్తుతం దేశంలో చురుకైన కేసుల సంఖ్య 9 లక్షల 61 వేల 370 గా వుంది.. ఈ 9 రాష్ట్రాల్లో, గరిష్టంగా 81శాతం మంది రోగులు కూడా మరణించారు.

ఇప్పటివరకు దేశంలో 46 లక్షల 63 వేల 930 మందికి కరోనా వ్యాధి సోకింది. 24 గంటల్లో 97 వేల 570 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఇది ఒక రోజులో నమోదైన అత్యధిక అంటువ్యాధులు సంఖ్య. గురువారం, 96 వేల 760 కొత్త కేసులు వచ్చాయి. ఇదిలావుంటే భారత్ లో రోగులు వేగవంతంగా కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయం. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 81 వేల 455 మంది ఆసుపత్రి నుండి విడుదల అయ్యారు దీంతో కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య ఇప్పుడు 36 లక్షల 24 వేల 375 కు పెరిగింది. ఇప్పటివరకు 77 వేల 742 మంది సంక్రమణ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories