Coronavirus Effect on Civils Interviews: సివిల్స్ ఇంటర్యూలకు కరోనా సెగ.. ఆన్ లైన్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు

Coronavirus Effect on Civils Interviews: సివిల్స్ ఇంటర్యూలకు కరోనా సెగ.. ఆన్ లైన్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు
x
Online Interview
Highlights

Coronavirus Effect on Civils Interviews: కరోనా అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. చివరకు విద్యా వ్యవస్థనైతే గతంలో ఎన్నడూలేని విధంగా మార్పులు చేసే పరిస్థితిని కల్పించింది.

Coronavirus Effect on Civils Interviews: కరోనా అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. చివరకు విద్యా వ్యవస్థనైతే గతంలో ఎన్నడూలేని విధంగా మార్పులు చేసే పరిస్థితిని కల్పించింది. ఏకంగా పలు తరగతులకు చెందిన పరీక్షలను రద్దు చేసేందుకు కారణమయ్యింది. దీనిలో భాగంగానే ఏటా నిర్వహించే దేశంలోనే అత్యుత్తమ పరీక్షలైన యూపీఎస్సీ కి కూడా దీని సెగ తగిలింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలను మార్పు చేయగా, తాజాగా తుది దశలో నిర్వహించే ఇంటర్యూలను ఏకంగా అన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

దేశ‌వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న త‌రుణంలో UPSC కీల‌క‌ మార్పుల‌కు సిద్ధ‌మైంది. ఇక‌పై అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించే యోచ‌న‌లో ఉంది. ఈ మేర‌కు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, కమిషన్ అధికారులు.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించే అంశంపై చ‌ర్చించారు. ప్ర‌త్య‌క్షంగా ఇంటర్వ్యూలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల‌.. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంద‌ని‌..అందుకే అభ్యర్థులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించాల‌ని క‌మిష‌న్ భావిస్తోంది.

కాగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల ఇంటర్వ్యూలు జూలై 20 నుంచి 30 వరకు జ‌ర‌గ‌నున్నాయి.ఇంటర్వ్యూలు ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశాన్ని కమిషన్ ప‌రిశీలిస్తున్న క‌మిష‌న్.. , సివిల్స్ ప్రిలిమ్స్‌ను కూడా అలా నిర్వ‌హించొచ్చా అన్న కోణంలోనూ చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ఇప్ప‌టికే మే నెలలో నిర్వ‌హించాల్సిన‌ సివిల్ ప్రిలిమ్స్‌ను అక్టోబర్ 4కు వాయిదా వేసింది UPSC.


Show Full Article
Print Article
Next Story
More Stories