Coronavirus: దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌

Lock down 14 States
x
LockDown 14 states
Highlights

Coronavirus: రోజుకు నాలుగు ల‌క్ష‌లపైగా కోవిడ్ కేసులు న‌మోదు కావ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తుంది

Coronavirus: దేశవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సెంక‌డ్ వేవ్ విల‌య‌తాండ‌వం చేస్తుంది. ఏ రాష్ట్రంలో చూసినా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒక వైపు క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ రోజురోజుకు కొవిడ్ పాజిటివి రేటు ఆమాంతం పెరిగిపోతుంది. ఆక్సిజ‌న్ అంద‌క ప్రాణాలు కొల్పోయే వారి సంఖ్య పెరిగిపోతుంది. రోజుకు నాలుగు ల‌క్ష‌లపైగా కోవిడ్ కేసులు న‌మోదు కావ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఈ నేప‌థ్యంలో క‌రో్నా మ‌హమ్మారి క‌ట్ట‌డికి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. క‌రోనా చైన్ తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశంలోని 14 రాష్ట్రాలు లాక్ డౌన్ విధించ‌గా మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ర్ఫ్యూ ని అమ‌లు చేస్తున్నాయి. ఏయే రాష్ట్రాల్లో తెలుసుకోండికుందాం.

మహారాష్ట్ర: ఏప్రిల్‌ 5న కర్ఫ్యూ లాంటి లాక్‌డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు.

ఢిల్లీ: 10వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. పొడగించే అవకాశం ఉంది.

హరియాణా: మే 3 నుంచి మొత్తం వారం రోజుల పాటు 10వ తేదీ వరకు.

మణిపూర్: మే 7 వరకు లాక్ డౌన్

కేరళ: ఈనెల 16వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

మధ్యప్రదేశ్‌: ఈనెల 15 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది.

ఉత్తరప్రదేశ్‌: ఈనెల 10 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.

హిమాచల్‌ప్రదేశ్‌: ఈనెల 16 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌.

తమిళనాడు: మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్‌

కర్ణాటక: ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌

రాజస్థాన్‌: ఈనెల 10 నుంచి 24 వరకు లాక్‌డౌన్‌

బిహార్‌: మే 4 నుంచి 15 వరకు లాక్‌డౌన్‌

చండీగఢ్‌: వారం రోజుల లాక్‌ డౌన్‌

గోవా: మే 9 నుంచి 23 వరకు కొన‌సాగ‌నుంది

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా క‌ర్ఫ్యూ విధించారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి తెల్ల‌వారి ఆరు గంట‌ల వ‌రకు కర్ఫ్యూ విధించారు. తెలంగాణ‌లో కూడా నైట్ క‌ర్ఫ్యూ విధించారు. సాయంత్రం 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతంది.

Show Full Article
Print Article
Next Story
More Stories