భారత్‌లో డెల్టా ప్లస్‌ వేరియంట్ టెన్షన్.. కొత్త వేవ్‌కు దారితీస్తున్న డెల్టా ప్లస్

Coronavirus Delta Plus Variant Becoming New Concern for India
x

భారత్‌లో డెల్టా ప్లస్‌ వేరియంట్ టెన్షన్.. కొత్త వేవ్‌కు దారితీస్తున్న డెల్టా ప్లస్

Highlights

Delta Plus Variant: భారత్‌ను డెల్టాప్లస్‌ వేరియంట్ టెన్షన్‌ పెడుతోంది.

Delta Plus Variant: భారత్‌ను డెల్టాప్లస్‌ వేరియంట్ టెన్షన్‌ పెడుతోంది. భారత్ సహా 9 దేశాల్లో డెల్టాప్లస్‌ వేరియంట్‌ ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో మొత్తం 30 డెల్టాప్లస్‌ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దీనిని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రకటించింది. ఈ కేసుల న‌మోదుతో డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు న‌మోదైన‌ దేశాల జాబితాలో భార‌త్‌ చేరింది. ప్రపంచంలోని 80 దేశాలలో డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు న‌మోద‌య్యాయి.

ప్రస్తుతం దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని భారతీయ సార్స్ కోవ్‌-2 జినోమిక్స్ కన్సార్టియం నివేదించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ డెల్టాప్లస్ వేరియంట్ అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలాండ్, నేపాల్, చైనా, రష్యాల‌లో క‌నిపించింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భారతదేశంతో సహా ప్రపంచంలోని 80 దేశాలలో డెల్టా వేరియంట్ క‌నిపించింద‌న్నారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మహారాష్ట్రలోని రత్నగిరి, జల్గావ్, కేరళ, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకల‌లో న‌మోద‌య్యాయి. ఈ రాష్ట్రాలలో ఆరోగ్యవిభాగాలు అప్రమ‌త్తం కావాల‌ని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories