Coronavirus: భారత్‌లో మళ్లీ కరోనా విలయతాండవం

Coronavirus Cases Hiking in India
x

కరోనా (ఫైల్ ఫోటో)

Highlights

Coronavirus: రోజుకు 60వేలకుపైగా కొవిడ్‌ పాజిటివ్ కేసులు * గడిచిన 24 గంటల్లో భారత్ లో 62వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదు

Coronavirus: భారత్‌లో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. భారీ మొత్తంలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఎంతలా అంటే ఒక్కరోజులో దాదాపు 60వేల మంది వైరస్‌ బారిన పడుతున్నారు. చెప్పాలంటే రికవరీల కన్నా కొత్త కేసులే అధికంగా నమోదవడంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4లక్షల 21వేల 66కి పెరిగింది. మూడున్నర నెలల తర్వాత దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4లక్షల మార్కును దాటింది.

ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. దీంతో కరోనా నిబంధనలను ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆరాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే హెచ్చరించారు. కాగా హోలి, షబ్‌-ఏ-బారాత్‌ పండుగల నిర్వహణపై నాగ్‌పూర్‌ కార్పొరేషన్‌ బ్యాన్‌ విధించింది. మాస్కులు ధరించని వారిపై విధిస్తున్న వంద రూపాయల జరిమానాను 500రూపాయలకు పెంచుతూ చత్తీస్‌గఢ్‌ నిర్ణయించింది. మహారాష్ట్ర తర్వాత పంజాబ్‌, కర్ణాటకలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి పంజా విసురుతోంది. ఇప్పటికే మెక్సికోలో మహమ్మారి బారిన పడి రెండు లక్షల మందికిపైగా మృతిచెందారు. దీంతో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత అత్యధిక కొవిడ్‌ మరణాలతో ఈదేశం మూడో స్థానంలో నిలిచింది. కాగా ఆదేశంలో ప్రస్తుత పరిస్థతిని సమీక్షించిన అధ్యక్షుడు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు.

గడిచిన 24 గంటల్లో:

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో 62వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 62వేల 258 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాదిలో ఒకేరోజు నమోదైన అత్యథిక కోవిడ్ కేసులు ఇవే. గడిచిన 24 గంటల్లో కరోనాతో 291 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కోవిడ్ కేసులు కోటి 19లక్షల 8వేల 910కు చేరాయి. ప్రసుత్తం 4లక్షల 52వేల 647

యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్ లో మొత్తం కరోనా మృతుల సంఖ్య లక్షా 61వేల 240కు చేరాయి. తాజాగా 30వేల 386 మంది కరోనాతో రికవరీకగా.. మొత్తం ఇప్పటి వరకు దేశంలో కోటి 12లక్షల 95వేల 23 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 5కోట్ల 81లక్షల 9వేల 773 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories