భారత్ లో కోటి దాటిన కరోనా కేసులు

భారత్ లో కోటి దాటిన కరోనా కేసులు
x
Highlights

India: భారత్ లో కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..ప్రస్తుతం దేశంలో 1,00,04,599 మందికి...

India: భారత్ లో కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..ప్రస్తుతం దేశంలో 1,00,04,599 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 25,152 కేసులు నమోదు కాగా, 347 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 29,885 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 1,00,04,599 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,08,751 ఉండగా, 95,50,712 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,45,136 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 95.40 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.45 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 3.09 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మహమ్మారి నుంచి 16కోట్లకుపైగా కరోనా నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శుక్రవారం ఒకే రోజు 11,71,868 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఇప్పటి వరకు 16,00,90,154 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories