Corona: పతాక స్థాయికి చేరనున్న కోవిడ్ కేసులు.. ఐఐటీ శాస్త్రవేత్తల కీలక రిపోర్టు

Coronavirus Becomes More Dangerous in May 3rd week
x

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: మే నెల మూడో వారంలో దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ మ‌రింత ఉద్ధృతం

Corona: కరోనా వైరస్‌ మహా మహా దేశాల సత్తాకే సవాలు విసరుతోంది. ప్రస్తుతం శ్మశానవాటికలో చల్లారని చితిమంటలు.. కరోనా మారణ హోమానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఈ కల్లోలాన్ని ఎదుర్కోవడానికి భారత్‌ శతధా ప్రయత్నిస్తోంది. కరోనా కోరల్లో చిక్కుకుపోయి భవిష్యత్తు ఏంటో అర్దంకాక ప్రజలు అయోమయంలో ఉంటే... మరికొన్ని ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు కథ అంతా ముందే ఉందని శాస్త్రవేతలు హెచ్చరిస్తున్నారు.

ఓవైపు మండే చితిమంటలు. మరోవైపు ఆప్తుల ఆర్తనాదాలు.! అసాధారణరీతిలో శవాలు.! వరుసపెట్టి దహనాలు.! కొవిడ్ కల్లోలానికి వల్లకాడు సైతం వల్లకాదంటోంది. మరుభూమిలో కట్టెపట్టుకుని నిలుచుకునే కాటికాపరులే కాలుతున్న కాష్ఠాన్ని చూసి కన్నీరు పెడుతున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పట్లో విరగడయ్యేలా లేదని తాజాగా దేశ తల్లడిల్లు తున్న తీరు చూస్తే అర్థమవుతోంది. అయితే అసలు కథ ముందుంది అని శాస్త్రవేతలు హెచ్చరిస్తున్నారు. మహమ్మరీ ఇలాగే కొనసాగితే దేశంలో మరో మూడు వారాల తర్వాత పతాక స్థాయికి చేరుకొనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మున్ముందు కరోనా మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ సెకెండ్ వేవ్ మరో మూడు వారాల తర్వాతగానీ పీక్ స్థానానికి చేరబోదని ఐఐటీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా అధ్యయ‌నం చెబుతుంది. మే 11-15 తేదీల మధ్య వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయని, అప్పటిలోగా యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35 లక్షలకు పెరుగుతాయని వారు పరిశోధకులు తెలిపారు. అంతేకాదు, ఏప్రిల్ 25-30 కల్లా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణా రాష్ట్రాల్లో కొత్త కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో ఇప్పటికే కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగే మే నెలాఖరుల కల్లా కేసులు బాగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తల అంచనా.

కరోనా సెకండ్‌ వేవ్‌ మే నెల మూడో వారంలో దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ మ‌రింత ఉద్ధృతం కానుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా అధ్యయ‌నం సూచించింది. ఎస్బీఐ తాజా రిపోర్ట్ ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా రిక‌వ‌రీ రేట్లు మెరుగుపడుతుంటే భారత్ లో మాత్రం రికవరీ రేటు తగ్గుతూ ఉంది. ఫిబ్రవరి మధ్యలో భారత్ లో రిక‌వ‌రీ రేటు 97.3 శాతానికి చేరింది. అయితే అప్పటి నుంచీ సెకండ్ వేవ్ మొద‌లు కావ‌డంతో క్రమంగా త‌గ్గుతూ తాజాగా 85 శాతానికి చేరింది. ఈ రిక‌వ‌రీ రేటు 78-79 శాతానికి చేరిన‌ప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుతుంద‌ని ఎస్బీఐ అంచ‌నా వేసింది.

ఇప్పటికే కరోనా వైరస్‌ మహా మహా దేశాల సత్తాకే సవాలు విసరుతోంది. ప్రస్తుతం శ్మశానవాటికలో చల్లారని చితిమంటలు కరోనా మారణ హోమానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఈ కల్లోలాన్ని ఎదుర్కోవడానికి భరత్‌ శతధా ప్రయత్నిస్తోంది. కరోనాపై విజయ సాధనకు వ్యక్తులు, సంస్థలు, కలసికట్టుగా పోరాటం సాగించాలి. ఈ సమరంలోని లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. అయితే కరోనాను మానవుడు ఎప్పటికి లొంగదీస్తాడో ఇప్పుడప్పుడే చెప్పలేని స్థితి. ఈలోపు వైరస్‌తో సమరంలో మనం తగు పాఠాలు నేర్చుకొంటున్నామా లేదా అని తరచి చూసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో పశ్చాత్తాపమే మిగులుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories