Coronavirus: థర్డ్‌ వేవ్‌ టెన్షన్‌.. మూడో వేవ్‌లో పిల్లలకే ఎక్కువ ముప్పు

Coronavirus 3rd Wave Affect Children
x

రెప్రెసెంటేషనల్  ఇమేజ్ 

Highlights

Coronavirus: సెకండ్‌ వేవ్‌తో దేశం ఉక్కిరిబిక్కరవుతోంది.

Coronavirus: సెకండ్‌ వేవ్‌తో దేశం ఉక్కిరిబిక్కరవుతోంది. మార్చి నెల రెండో వారంలో మొదలైన రెండో దశ కరోనా వ్యాప్తి ఇంకా ఉధృతంగానే వుంది. అయితే జూన్‌, జూలైలో సెకండ్‌ వేవ్‌ తగ్గిపోతుందని వైద్య నిపుణులు అంఛనా వేస్తున్నారు. కానీ ఆ తర్వాత నాలుగు నుంచి ఆరు నెలలకు కచ్చితంగా కరోనా థర్డ్ వేవ్ రావడం ఖాయమని భయాందోళన కలిగించే ప్రకటన చేస్తున్నారు.

కరోనా సెంకడ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తోంది. మరోవైపు దేశంలో అక్కడక్కడ కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలైందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే మూడో వేవ్‌లో వైరస్‌ ప్రభావం పిల్లలపైనే ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులంతా హెచ్చరిస్తున్నారు! మొదటి దశలో పెద్దవాళ్లపై, రెండో దశలో యువతపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే మూడో దశలో మాత్రం పిల్లలు దీనికి ఎక్కువగా ప్రభావితమవుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పిల్లలకు కరోనా సోకినా అంత ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. అయితే వారి నుంచి పెద్దలకు వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. పిల్లలకు కరోనా సోకినా వారిలో వ్యాధి లక్షణాలు సాధారణంగానే ఉంటాయని ఆస్పత్రుల్లో చేర్చాల్సినంత సీరియస్ గా పరిస్థితి ఉండదని నీతి అయోగ్ తెలిపింది. అయితే 10 నుంచి 12 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు ఇతర పిల్లల్ని గుంపులుగా కలుస్తుంటారు కాబట్టి వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది.

ఈ నేపథ్యంలోనే సెకండ్‌ వేవ్‌ నేర్పిన గుణపాఠంతో థర్డ్‌వేవ్‌కి ముందుగానే సన్నద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు నియమించిన నిపుణుల కమిటీ సలహా మేరకు ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని ముంచెత్తగానే ఎదురైన మొట్టమొదటి సమస్య ఆక్సిజన్‌ కొరత. దీంతో ఈ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఉన్న ప్రతీ జిల్లాలో రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా చికిత్సలో ఉపయోగించే అత్యవసర, సాధారణ ఔషధాలు రెండు మూడు నెలలకు సరిపడ నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు తయారీదారులతో కేంద్రప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఔషధాల కొరత రాకుండా చూడాలంటూ ఫార్మా కంపెనీలను ఆదేశించింది. అయితే పద్దెనిమిదేళ్లు దాటినవారికే టీకాలు సరిగ్గా దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో 18 ఏళ్లలోపువారందరికీ వ్యాక్సినేషన్‌ అంటే చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories