కరోనా టీకా వచ్చేసింది.. టీకా ఎవరికి..ఎలా ఇస్తారు? కేంద్రం మార్గదర్శకాలు

Corona Vaccination guide lines
x
కరోనా వైరస్ టీకా ప్యాక్ (ఫైల్ ఇమేజ్)
Highlights

* ఈరోజు దేశవ్యాప్తంగా కొవిడ్‌ టీకా కార్యక్రమం ప్రారంభం * రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు * ఆహార, ఔషధ అలర్జీలు ఉన్నవారికీ ఇవ్వొద్దు * గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వద్దు * కొవిడ్‌ టీకా ఇచ్చాక ఇతర టీకాలు ఇవ్వాలంటే రెండు వారాల వ్యవధి తప్పనిసరి

దేశవ్యాప్తంగా శనివారం నుంచి కొవిడ్‌ టీకా కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. రెండు టీకాలకూ సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఫ్యాక్ట్‌షీట్‌ రూపంలో ఇచ్చింది. వాటిని ఏ ప్లాట్‌ఫామ్‌ వినియోగించి తయారుచేశారు, ఏ రకం టీకా, ఎంత డోసు ఇవ్వాలి, ఎవరికి టీకా ఇవ్వకూడదు?, టీకాలను ఎంత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి, టీకా తీసుకున్నాక దుష్ప్రభావాలు కనిపిస్తే ఏం చేయాలి? తదితర వివరాలు ఇచ్చింది. ఈ సమాచారం మొత్తాన్నీ అన్నిస్థాయుల్లోని ప్రోగ్రామ్‌ మేనేజర్లకూ.. కోల్డ్‌ చైన్‌ స్టోరేజీలను నిర్వహించేవారికి, వ్యాక్సిన్‌ వేసేవారికి చేరవేయాలని సూచించింది.

18 ఏళ్లు అంతకుమించి వయసున్నవారికి మాత్రమే టీకా ఇవ్వాల్సి ఉంటుంది. టీకా తీసుకున్న తర్వాత ఇతర టీకాలు తీసుకోవడానికి కనీసం 14 రోజుల వ్యవధి ఇవ్వాలని ఆరోగ్య శాఖ సూచించింది. మొదటి డోసుగా ఏ టీకా తీసుకుంటే రెండో డోసు ఇచ్చేటప్పుడు కూడా అదే ఇవ్వాలి. మార్చకూడదని సూచించారు. తొలి డోసు కొవిషీల్డ్‌ ఇచ్చినవారికి రెండో డోసూ అదే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గతంలో కొవిడ్‌-19 టీకా డోసు తీసుకున్నప్పుడు అలర్జీ వచ్చినవారికి టీకా వేయకూడదని ఆరోగ్య శాఖ సూచించింది. ఆహార పదార్థాల అలర్జీలు ఉన్నవారికి, ఔషధాలు, టీకాల వల్ల అలర్జీలు వచ్చేవారికి టీకా వేయొద్దని అధికారులు చెప్పారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో గర్భిణులు, పాలిచ్చే తల్లులు పాల్గొనలేదు కాబట్టి.. అలాంటివారికి వ్యాక్సిన్‌ వేయొద్దని వైద్యులు సూచించారు.

గతంలో కొవిడ్‌ వచ్చి తగ్గినవారికి, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇవ్వొచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి, హెచ్‌ఐవీ పేషెంట్లకు, రోగనిరోధక శక్తిని అణచివేసే ఔషధాలను వాడుతున్నవారికి కొన్ని జాగ్రత్తలతో ఇవ్వొచ్చని వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories