కరోనా వాక్సిన్ ఖరీదు ఎంత..?

Corona Vaccine Price in India
x
representational image
Highlights

* కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు లాభాపేక్ష లేకుండా సరఫరా * ఒక్కో డోసును కేవలం రూ.2 వందలు * సామాన్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పేదల కోసం తక్కువ ధర

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వ్యాక్సిర్ రానే వచ్చింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా పంపిణీ మొదలైంది. రెండు మూడు రోజుల్లో టీకా వేసేందుకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి. అయితే వ్యా్క్సిన్ వేసుకోవాలనుకుంటే దానికయ్యే ఖర్చెంత? అసలు వ్యాక్సిన్‌ మార్కెట్లో లభ్యమవుతుందా?

దేశవ్యాప్తంగా కరోనా టీకా వేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీ కూడా మొదలైపోయింది. వ్యాక్సిన్ పంపిణీ ఒక చరిత్రాత్మక ఘట్టమన్న సీరమ్ సీఈవో అదర్ పూనావాలా దేశపౌరులందరికీ వ్యాక్సిన్ అందించటమే తమ లక్ష్యమని తెలిపారు.వ్యాక్సిన్ పంపిణీ చరిత్రాత్మక ఘట్టమన్న సీరమ్ సీఈవో

కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వ్యాక్సిన్‌ను లాభాపేక్ష లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు అదర్ పూనావాలా. ఒక్కో డోసును కేవలం 2 వందల రూపాయలకే అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని సామాన్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పేదల కోసం తక్కువ ధరకే విక్రయిస్తున్నామన్నారు. అయితే ఈ ధర కేంద్రంకు తొలి దశలో అందించే 10 కోట్ల డోసుల వరకే వర్తించనుంది.

ఇక బహిరంగ మార్కెట్ లో ఒక్కో వ్యాక్సిన్ డోసును వెయ్యి రూపాయలకు విక్రయించనుంది సీరమ్. అవసరం ఉన్న వారు మార్కెట్ లో ఈ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అటు విదేశాల్లో కూడా కొవిషీల్డ్‌కు భారీగా డిమాండ్ ఉండటంతో నెలకు 70 నుంచి 80 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది సీరమ్.

Show Full Article
Print Article
Next Story
More Stories