India: భయపెడుతున్న కరోనా ట్రిపుల్ మ్యుటేషన్లు.. చిన్నారులపై ఎక్కువ ఎఫెక్ట్..

Corona Triple Mutation Variant In India
x

India: భయపెడుతున్న కరోనా ట్రిపుల్ మ్యుటేషన్లు.. చిన్నారులపై ఎక్కువ ఎఫెక్ట్..

Highlights

India: కోవిడ్ సెకండ్ వేవ్ తో అల్లకల్లోలం అవుతున్న వేళ భారత్ కు మరో సవాల్ ఎదురైంది.

India: కోవిడ్ సెకండ్ వేవ్ తో అల్లకల్లోలం అవుతున్న వేళ భారత్ కు మరో సవాల్ ఎదురైంది. రోజుకో రూపంతో విరుచుకుపడుతోన్న కోవిడ్ మూడు రకాల వేరియంట్లతో కలిసి మరో కొత్త రూపం దాల్చింది. ఈ వేరియంట్ కేవలం పెద్దల్లో మాత్రమే కాదు చిన్నారుల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. పెద్దలు, చిన్నారుల్లో సమానంగా ప్రాణాంతకంగా వైరస్ వ్యాపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రిపుల్ మ్యుటేష న్ భారత్ కు సవాలు విసురుతోంది. ఈ కొత్త వెరియంట్ ను భారత్ లో మహారాష్ట్ర , ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లలో పరిశోధకులు గుర్తించారు. ఇక ఈ ట్రిపుల్ మ్యుటెంట్ చాలా వేగంగా వ్యాప్తిస్తోందని తెలిపారు. ఈ వైరస్ తొందరగా అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

మనం వ్యాక్సిన్లు ఇంప్రూవ్ చేసుకోవాలని మెక్ గిల్ యూనివ‌ర్సిటీ ఎపిడెమియాల‌జీ ప్రొఫెస‌ర్ మధుక‌ర్ అన్నారు. దాని కంటే ముందు జబ్బు ఏంటో తెలుసుకోవాలన్నారు. కొవిడ్ యుద్ధంలో ఆల్రెడీ అడుగుపెట్టేశామని తెలిపారు. ఈ కొత్త వెరియంట్ భార‌త్‌కు ఛాలెంజ్‌గా మారింద‌ని చెప్పుకొచ్చారు.

ట్రిపుల్ మ్యూటేషన్ అంటే రెండు కరోనా స్ట్రెయిన్స్ కలిపితే తయారైందే డబుల్ మ్యూటేషన్. ఇప్పుడు మూడు కొవిడ్ వేరియంట్లు కలిస్తే వచ్చినదానిని ట్రిపుల్ మ్యూటేషన్ అంటారు. ఇది మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఢిల్లీలలో కనిపించింది. ఈ కొత్త త‌ర‌హా వైర‌స్‌ భార‌త్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయి. అంతేకాకుండా ఈ ట్రిపుల్ మ్యుటేష‌న్ కార‌ణంగా చిన్నారుల్లో క‌రోనా ఎక్కువ‌గా సోకుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. 8 నెలల చిన్నారుల నుంచి 14ఏళ్ల పిల్లల వరకు వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో గరిష్ట స్థాయిలో కరోనా కేసులు ఎక్కువగా పిల్లల్లోనే నమోదయ్యాయి. ప్రస్తుత మ్యుటేట్ వైరస్ లు పిల్లల్లోనూ వ్యాపిస్తుండటంతో వారిలో కొత్త కరోనా లక్షణాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories