కరోనా మూడో ఉద్ధృతి ముప్పు, జనవరి- ఏప్రిల్ మధ్య తీవ్రస్థాయికి చేరే ఛాన్స్

కరోనా మూడో ఉద్ధృతి ముప్పు, జనవరి- ఏప్రిల్ మధ్య తీవ్రస్థాయికి చేరే ఛాన్స్
x
Highlights

Corona Third Wave Alert: పండగల సీజన్‌ కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటున్న ఎయిమ్స్ డైరెక్టర్

Corona Third Wave Alert: కరోనా మూడో ముప్పు పొంచి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, జనవరి- ఏప్రిల్ మధ్య తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో కచ్చితంగా ప్రజలు సూచనలు పాటించాలని సూచించారు. టూరిస్ట్‌ల సంఖ్య పెరగడం, సభలు, సమావేశాలతో ప్రజలు గుమిగూడటం మూడో ఉద్ధృతికి దారి తీయొచ్చని తెలిపారు. ఇటీవల టూరిస్ట్ లు పెరిగిన మనాలి, డార్జిలింగ్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు పెరిగాయని పేర్కొన్నారు.

రాష్ట్రాలు ఆంక్షలను పాటించకపోతే మూడో ఉద్ధృతి ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. భారత్‌లో మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసులు 103శాతం వరకూ ఉండొచ్చనే అంచనా వేశారు. ఇక కొవిడ్‌ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా.. పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుందని తెలిపారు. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు.

ఇక సోషల్ డిస్టెన్స్‌ పాటించకపోతే కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం వంటి పనులతో కరోనా ముప్పు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పర్యాటకులు పెరిగే స్థానిక వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది కానీ... టూరిస్ట్‌లు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని... అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుందన్నారు.

దేశానికి మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories