Corona Medicine: కోవిడ్‌ డ్రగ్‌ 2-డీజీ ఔషధం విడుదల

Corona Medicine: DRDOs Anti-Covid 2-DG Drug Released
x

Corona Medicine: కోవిడ్‌ డ్రగ్‌ 2-డీజీ ఔషధం విడుదల

Highlights

Corona Medicine: కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) అందుబాటులోకి వచ్చింది.

Corona Medicine: కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) అందుబాటులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలి బ్యాచ్‌ 2డీజీ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు అందించారు. ఆరోగ్యమంత్రి వాటిని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు ఇచ్చారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. 2డీజీ ఔషధంతో కొవిడ్‌ రికవరీ సమయం తగ్గడంతో పాటు ఆక్సిజన్‌ అవసరం కూడా తగ్గుతుందని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరులో డీఆర్‌డీవో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

పదివేల డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories