Corona New Variant: మళ్లీ మహమ్మారి కొత్త వేరియంట్‌ కలకలం..భయం​ గుప్పెట్లో పలు దేశాలు

Corona Is Coming Back With A New Variant Called Eris
x

Corona New Variant: మళ్లీ మహమ్మారి కొత్త వేరియంట్‌ కలకలం..భయం​ గుప్పెట్లో పలు దేశాలు

Highlights

Corona New Variant: హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్‌వో

Corona New Variant: కరోనా మళ్లీ విజృంభిస్తోందా ? మళ్లీ మహమ్మారి విస్తరించనుందా ? మళ్లీ మాస్కులు తప్పవా ? అవుననే అంటోంది డబ్ల్యూహెచ్‌వో.ఇంతవరకు కరోన కొత్త వేరింట్‌ ఒమిక్రాన్‌ గురించి, దాని తాలుకా కేసులు చూశాం. ఇప్పుడు అది ఒమిక్రాన్‌ నుంచి మరో కొత్త వేరియంట్ 'ఈజీ.5.1'గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది. యూకేలో కరోనా కొత్త వేరియంట్‌ ఎరిస్‌అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్‌లోని హెల్త్‌ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 15శాతం కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి..ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్తవేరియంట్‌లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ఈ వారంలో ఆ కొత్త వేరియంట్‌కి సంబంధించి..సుమారు నాలుగువేల కేసు వచ్చాయిని చెప్పారు.

ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కొత్త వేరియంట్‌కి ఎరిస్‌ అనే పేరుతో వర్గీకరించారు. తొలిసారిగా జూలై 3, 2023న దీని తాలుకా కేసులను గుర్తించారు. అది కాస్త నెమ్మదిగగా పెరగడంతో ఆరోగ్య అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు ఆస్పత్రిలో చేరే రేటు పెరగుతున్నట్టు తెలిపారు. మొత్తంగా చూస్తే ఆస్పత్రిలో చేరే పరిస్థితులు తక్కువుగానే ఉన్నాయని, అలాగే ఐసీయూలో అడ్మిట్‌ అవుతున్న కేసులు పెద్దగా పెరగలేదని యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది.

ఏది ఏమైనా ఈ మహామ్మారీ కేసులు పెరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. ఇయూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్‌ డాక్టర్‌ మేరి రామ్‌సే. ప్రజలంతా ఈ వైరస్‌ల బారిన పడకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, అలానే శ్వాసకోస సంబంధ సమస్యలు ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సైతం ఈ కొత్త వేరింట్‌ కేసులను ట్రాక్‌ చేయడం ప్రారంభించింది.

ప్రజలంతా ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్‌లు, సంరక్షణ పద్దతులను అవలంబించాలని వైద్యాధికారులు సూచించారు. అలాగే అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు,. . కాగా యూకేలో నెమ్మదిగా పెరుగుతున్న ఈ కొత్త వేరియంట్‌ కేసులపై నిపుణలు, అధికారలు పరిశోధనలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రజలు ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories