Corona Effect on Employment: కరోనా ఎఫెక్ట్.. పెరిగిన నిరుద్యోగం

Corona Effect on Employment: కరోనా ఎఫెక్ట్.. పెరిగిన నిరుద్యోగం
x
Highlights

Corona Effect on Employment: కరోనా ప్రభావం ఒక ఆర్థిక రంగంపైనే కాదు... అన్ని రంగాలపైనా పడింది...

Corona Effect on Employment: కరోనా ప్రభావం ఒక ఆర్థిక రంగంపైనే కాదు... అన్ని రంగాలపైనా పడింది... చివరకు చిన్న చిన్న కంపెనీలు మూత పడటంతో అందుల్లో పనిచేసే వారంతా ఇప్పుడు నిరుద్యోగులుగా మారి, మరింత నిరుద్యోగం పెరిగింది. సీఎం ఐఈ నివేదిక ప్రకారం 11 శాతానికి మించి పెరిగిందని అంచనా వేసింది. ఇది లాక్ డౌన్ విధించిన ప్రారంభం నెల నుంచి వరుసగా పెరుగుతూ వస్తోంది. క‌రోనా వ‌ల్ల ఎంతోమంది ఉద్యోగాలు హుష్‌కాకి అయ్యాయి. ఇప్ప‌టికే నిరుద్యోగ భార‌తంగా పేరు గాంచిన మ‌న దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఇప్పుడు మ‌రింత పెరిగింది.

అర్బ‌న్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ వ‌ల్ల విధిస్తున్న‌ క‌ఠిన ఆంక్ష‌ల వ‌ల్ల‌ ప‌ట్ట‌ణాల్లో నిరుద్యోగుల సంఖ్య‌ 11.26 శాతానికి ఎగ‌బాకింద‌ని సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ(సీఎంఐఈ) అధ్య‌య‌నం తెలిపింది. ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం గ‌త నాలుగువారాలుగా త‌గ్గుముఖంగా ఉన్న‌ పట్ట‌ణ నిరుద్యోగిత జూలై 5 నాటికి 10.69 నుంచి 11.26 శాతానికి పెరిగింది. ఈ పెరుగుద‌ల క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, అస్సాం, ప‌శ్చిమ బెంగాల్‌, మ‌హారాష్ట్ర‌లో అధికంగా ఉంది. మ‌రోవైపు లాక్‌డౌన్‌ వ‌ల్ల మార్కెట్లో డిమాండ్ ప‌డిపోవ‌డం, కూలీల కొర‌త.. సూక్ష్మ‌, స్థూల ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్ర‌భావం చూపుతోందని, ప్ర‌తిఫ‌లంగా ఉద్యోగ భ‌ద్ర‌త‌పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. (నిరుద్యోగ రేటు స్ధిరంగా ఉన్నా..)

ఏప్రిల్‌లో 17.7 మిలియ‌న్ల మంది ఉద్యోగాలు కోల్పోగా ఈ సంఖ్య మేనాటికి 17.8కి చేరింది. అయితే జూన్‌లో 3.9 మిలియ‌న్ల మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన‌ట్లు సీఎంఐఈ గ‌త‌వారం త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆల్ ఇండియా మ్యానుఫాక్చ‌ర్స్ ఆర్గ‌నైజేష‌న్ మాజీ అధ్య‌క్షుడు కెఈ ర‌ఘునాథ‌న్ మాట్లాడుతూ.. ఫార్మ‌ల్ సెక్టార్ కోలుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. ముఖ్యంగా వ‌ల‌స కార్మికులు తిరిగి ప‌ట్ట‌ణాల బాట ప‌ట్టేందుకు క‌నీసం ఆరు నెల‌లు ప‌డుతుంద‌ని తెలిపారు. అలాగే అటు ఉద్యోగాలు కోల్పోవ‌డంతోపాటు, ఆదాయం త‌గ్గింపు కూడా అనేక రంగాల్లో ప‌నిచేస్తున్నవారి జీవితాల‌ను ప్ర‌మాదంలోకి నెట్టివేసింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories