ఢిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు!

ఢిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు!
x
Highlights

ఢిల్లీలో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 8 వేల 593 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 59 వేల 975కు చేరింది.

ఢిల్లీలో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 8 వేల 593 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 59 వేల 975కు చేరింది. అటు మరణాల రేటు కూడా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 85 మంది మృతి చెందారు. ఇంత మొత్తంలో మరణాలు నమోదుకావటం ఇది రెండో సారి కాగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 42 వేల 629గా ఉంది. పండుగ సీజన్‌, శీతాకాలం ప్రారంభంతో కాలుష్యం పెరిగి ఈ మహమ్మారి వ్యాప్తి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు ఢిల్లీ హైకోర్టు అరవింద్‌ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గత రెండు వారాల్లో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యల వివరాలను తెలపాలని ఆదేశించింది. రోజువారి కేసుల సంఖ్య మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలను మించిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఎలాంటి పటిష్టమైన చర్యల్ని తీసుకుంటోందని అడిగింది. ఇతర రాష్ట్రాలు కరోనా ఆంక్షలు విధిస్తుంటే ఢిల్లీలో మాత్రం అటువంటి నిబంధనలు పాటించటం లేదని.. ఈ పరిణామం వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువ అవుతుందని హెచ్చరించింది. ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలపై స్పందించిన ప్రభుత్వం రానున్న పండుగల దృష్ట్యా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి పరీక్షల సంఖ్య పెంచుతున్నామని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories