Corona: భారత్ లో కరోనా కల్లోలం

Corona Cases Are on the Rise in India
x

Corona:(Photo The Hans India) 

Highlights

Corona: భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి.

Corona: భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. వ్యాక్సిన్ వచ్చినా పరిస్థితి మారడం లేదు. కొన్ని రాష్ట్రాలు రాత్రి పూట లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యే దీనికి అద్దం పడుతోంది. కరోనా మొదట్లో మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, లాక్‌డౌన్‌తో కొవిడ్‌ను కొంత మేర కంట్రోల్ చేయగలిగాం. కానీ సెకండ్ వేవ్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం కొందరు కరోనా రూల్స్‌ను పాటించకపోవడమే. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి.. బౌతికదూరం పాటిస్తే కరోనా సెకండ్ వేవ్ ఇంత వేగంగా వ్యాపించేదికాదంటున్నారు వైద్య నిపుణులు

20 రోజుల కాలంలో భారీగా నమోదు...

సెకండ్‌ వేవ్‌ వణుకు పుట్టిస్తోంది. 20 రోజుల కాలంలో భారీగా నమోదవుతోన్న కేసులతో దేశవ్యాప్తంగా మళ్లీ భయానక పరిస్థితులు మొదలయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిని చేరుతుండటంతో ఆందోళన చెందుతున్నారు దేశ ప్రజలు. నిన్న లక్షా 26వేల 789 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం నుంచి గురువారం మధ్య 685 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో భారత్ లో మొత్తం కోవిడ్ కేసులు కోటి 29లక్షల 28వేల 574కు చేరాయి.ప్రసుత్తం 9లక్షల 10వేల 319 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రికవరీ రేటు 95 శాతం కంటే ఎక్కువగానే ఉన్నా...

దేశంలో కరోనా రికవరీ రేటు 95 శాతం కంటే ఎక్కువగానే ఉన్నా... కొత్త కేసులు కూడా అదే స్థాయిలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఢిల్లీలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది.

కోవిడ్ కట్టడికి చర్యలు...

ఇక మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, తమిళనాడు, యూపీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో కర్ఫ్యూలతో పాటు ప్రజలు గుమిగూడకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో కరోనా ఉద్ధృతి పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. బెంగళూరుతో పాటు ఏడు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించనుండగా.. శనివారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దేశంలో నమోదయ్యే కేసుల్లో సగం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఒక్కరోజే దాదాపు 30 వేల నుంచి 50 వేలకు పైగా కేసులు నమోదవ్వడంతో.. మహారాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సీఎం ఉద్దవ్‌ థాక్రే నిర్ణయం తీసుకున్నారు.

మళ్లీ లాక్‌డౌన్ ఉండే ప్రసక్తే లేదు...

కరోనా కట్టడిపై ముఖ్యమంత్రులతో చర్చించిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండే ప్రసక్తే లేదని మోడీ తేల్చి చెప్పారు. అయితే.. దేశంలో కరోనా పరిస్థితి సీరియస్‌గా ఉందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయన్న ప్రధాని.. రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాని సూచించారు. పెరుగుతున్న కేసులను చూసి భయపడొద్దన్న ప్రధాని.. కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూను ప్రత్యామ్యాయంగా వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories