Booster Dose: కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌కు బూస్టర్‌డోసుగా కార్బివాక్స్‌

Corbevax as Booster Dose in Those Vaccinated With Covishield or Covaxin
x

బూస్టర్ డోస్ గా  కోర్బెవాక్స్  వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Booster Dose: ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి కోరిన బయోలాజికల్‌-ఇ

Booster Dose: కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో మూడో డోస్ వ్యాక్సిన్‌ అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అటు డబ్ల్యూహెచ్‌వో కూడా బూస్టర్ డోసు తీసుకోవడమే మంచిదని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ బయోలాజికల్‌ - ఇ.. కార్బివాక్స్‌ టీకాను బూస్టర్‌ డోసు కింద పంపిణీ చేయాలని భావిస్తోంది.

ఇప్పటికే కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నవారికి కార్బివాక్స్‌ను బూస్టర్‌డోసుగా ఇచ్చేలా మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం కార్బివాక్స్‌ టీకా రెండు, మూడు దశల క్లినికల్‌ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. 18 నుంచి 80ఏళ్ల లోపు వారిపై ఈ పరీక్షలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులో ఆ ప్రయోగాల ఫలితాలను కంపెనీ వెల్లడించనుంది.

టీకా తీసుకున్న కొన్ని నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పటికే చాలా దేశాలు బూస్టర్‌డోసుపై దృష్టిపెట్టాయి. దీంతో తాము కూడా ఆ దిశగా ప్రయోగాలు చేపట్టాలనుకుంటున్నట్లు బయోలాజికల్ ఇ వెల్లడించింది. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండు డోసులు పూర్తయి, కొవిడ్‌ నెగెటివ్‌ ఉన్న వాలంటీర్లపై ఈ ప్రయోగాలు జరపాలని భావిస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories