సామాన్యులకు షాకిచ్చిన మోడీ సర్కార్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు.. లీటర్‌ ఎంత పెరిగిందంటే?

సామాన్యులకు షాకిచ్చిన మోడీ సర్కార్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు.. లీటర్‌ ఎంత పెరిగిందంటే?
x

సామాన్యులకు షాకిచ్చిన మోడీ సర్కార్.. భారీగా పెరిగి వంట నూనె ధరలు.. లీటర్‌ ఎంత పెరిగిందంటే?

Highlights

కేంద్రం ప్రభుత్వ ప్రకటన సామాన్యులపై పెనుభారం మోపింది. మొన్నటి దాకా సాధారణంగా ఉన్న వంటనూనెల ధరలు ఒక్కసారిగా 20 రూపాయల వరకు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Cooking Oil Price Hike: ఇప్పటికే కూరగాయల ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉరుము.. ఉరుమి.. మంగళం మీద పడినట్లు.... కూరగాయల ధరలు చేసిన ధరల గాయం నుంచి జనం తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు పిడుగులాంటి వార్త చెప్పింది. వంటనూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు మోడీ సర్కార్ చేసిన ప్రకటనతో నూనెల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.

కేంద్రం ప్రభుత్వ ప్రకటన సామాన్యులపై పెనుభారం మోపింది. మొన్నటి దాకా సాధారణంగా ఉన్న వంటనూనెల ధరలు ఒక్కసారిగా 20 రూపాయల వరకు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లీటరు వంటనూనెపై 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెంచడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఇప్పటివరకు లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 115 రూపాయలు ఉండగా, ఒకే రోజు తేడాలో 130 రూపాయలకు చేరింది. పామోలిన్‌ ధర లీటరు 115 రూపాయలకు పెరిగింది.

ముడి పామోలిన్, సోయా, పొద్దు తిరుగుడుపై సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రకటనతో వ్యాపారులు ఒక్కసారిగా నూనెల ధరలు పెంచేశారు. వంటనూనెలతో పాటు పూజకు ఉపయోగించే నూనె ధరలు కూడా లీటరుకు 15 రూపాయలకు పైగా పెంచేశారు. దుకాణాల్లోనే కాదు ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు కూడా ధరలను పెంచాయి. కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతోనే తాము ధరలు పెంచాల్సి వచ్చిందంటున్నారు వ్యాపారులు.

వంటనూనెల ధరల పెంపుతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నిల్వ ఉన్న సరకుపైనా ధరలు పెంచడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే సమాచారంతో సామాన్యుల పరిస్థితి ఏమిటని వినియోగదారులు వాపోతున్నారు.

పామోలిన్‌ ఆయిల్‌ను హోల్‌సేల్‌లో లీటరు 110 రూపాయలకు అమ్ముతుండగా.. చిల్లరగా దుకాణాల్లో 115 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర కొన్ని దుకాణాల్లో 140 రూపాయలకు చేరింది. పూజలకు ఉపయోగించే నూనెల లీటరు ధర మొన్నటి వరకు 109 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం 120 రూపాయల ధర పలుకుతోందంటున్నారు మహిళలు.

Show Full Article
Print Article
Next Story
More Stories