మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం

Controversy over the Appointment of Victoria Gowri as a Judge of the Madras High Court
x

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం

Highlights

Victoria Gowri: దేశంలోని హైకోర్టుల్లో 13 మంది జడ్జిల నియామకం

Victoria Gowri: ఇటీవల దేశంలోని పలు హైకోర్టుల్లో 13 మంది న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు చేసింది. ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదం లభించడంతో న్యాయమూర్తుల నియామకాలు మొదలయ్యాయి. అయితే, మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా విక్టోరియా గౌరి నియామకం వివాదం రూపు దాల్చింది. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విక్టోరియా గౌరి గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాదు, ముస్లింలు, క్రైస్తవులపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో విక్టోరియా గౌరి నియామకాన్ని వ్యతిరేకిస్తూ పలువురు న్యాయవాదులు రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు లేఖలు రాశారు. మద్రాస్ హైకోర్టులో ఆమె నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలైంది.

ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. దీన్ని వచ్చే వారం విచారించే కేసుల జాబితాలో చేర్చుతామని చెప్పగా, ఈ అంశంపై త్వరితగతిన విచారణ జరపాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో, పిటిషన్ శుక్రవారం నాడు విచారణకు వచ్చేలా లిస్టింగ్ చేస్తామని సీజేఐ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories