ఢిల్లీలో G20 డిన్నర్‌ ఆహ్వాన పత్రికపై దుమారం

Controversy Over G20 Dinner Invitation In Delhi
x

ఢిల్లీలో G20 డిన్నర్‌ ఆహ్వాన పత్రికపై దుమారం

Highlights

G20 Summit In Delhi: ఇండియాను భారత్‌గా మార్చారంటూ జైరాం రమేష్‌ ట్వీట్‌

G20 Summit In Delhi: జీ-20 డిన్నర్ ఆహ్వాన పత్రికపై దుమారం చెలరేగింది. ఇన్విటేషన్‌ కార్డ్‌లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించి ఉండటం విమర్శలకు దారి తీసింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారని కాంగ్రెస్ స్పందించింది. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్ ఇన్విటేషన్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ నేపథ్యంలోనే ఇండియాను భారత్ గా మార్చారంటూ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా ఢిల్లీ వేదికగా జరగబోతున్న జీ 20 సదస్సు నేపథ్యంలో దేశ రాజధానిలో ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్ శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లను చేసింది.

భారత్‌ అధ్యక్షతన జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే గెస్ట్‌లకు ఇన్విటేషన్ అందింది. అయితే, ఈ ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించి ఉండటం చర్చకు దారి తీసింది.

ఇక తమకు అందిన ఇన్విటేషన్‌లో ఈ ఛేంజ్‌ను గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. జీ-20 విందు కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పేరుతో రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ఇంతకుముందు ఇండియా అని ఉంది. ఇప్పుడది భారత్‌ అని ఉంటుందని ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం వల్ల దీన్ని.. భారత్‌, అది ఇండియా, రాష్ట్రాల సమాఖ్య అని చదవాలని ట్వీట్ చేశారు. ఇది రాష్ట్రాల సమాఖ్యపైనా జరుగుతోన్న దాడి అని సోషల్‌మీడియా వేదికగా ఫైర్ అయ్యారు జైరాం రమేశ్.

అటు జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ దేశం పేరు భారత్ అని పేర్కొన్నారు. భారత్‌, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ అని అందులో ముద్రించారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరు మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇంగ్లీష్‌లోనూ ఇండియా నుంచి భారత్‌గా పేరు మారుస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories