Corona Vaccination: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్

Continuing Corona Vaccination Across India
x

కరోన వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona Vaccination: ఫ్రంట్‌లైన్ కార్మికుల్లో కోటి 12 లక్షల 29వేల 062 మందికి మొదటి డోసు

Corona Vaccination: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12 కోట్ల 25 లక్షల మందికి డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం రాత్రి వరకు 25 లక్షల 65 వేలకు పైగా డోసులు వేసినట్లు పేర్కొంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 12 లక్షల 25వేల 790 డోసులు వేసినట్టు కేంద్రం తెలిపింది. ఇందులో 91 లక్షల 27 వేల 451 హెల్త్ కేర్ వర్కర్లకు మొదటి డోసు, మరో 57వేలకు పైగా మందికి రెండో డోసు ఇచ్చినట్టు పేర్కొంది. అలాగే ఫ్రంట్‌లైన్ కార్మికుల్లో కోటి 12 లక్షల 29వేలకు పైగా మందికి మొదటి టీకా.. 55 లక్షలకు పైగా రెండో టీకా ఇచ్చినట్టు వెల్లడించింది.

45 నుంచి 60 సంవత్సరాల వయసున్న వారిలో 4కోట్ల మందికి మొదటి, 10 లక్షల మందికి రెండో డోసు వేశామని, 60 ఏళ్లకుపై బడిన 4 కోట్లకు పైగా మందికి ఫస్ట్ డోస్, 38 లక్షలకు పైగా మందికి సెకండ్ డోసు పంపిణీ చేసినట్టు కేంద్రం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories