చిదంబరం బెయిల్‌ను సవాలు చేస్తూ సిబిఐ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

చిదంబరం బెయిల్‌ను సవాలు చేస్తూ సిబిఐ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
x
Chidambaram (File Photo)
Highlights

మాజీ హోమ్ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం బెయిల్‌ను సవాలు చేస్తూ సిబిఐ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది....

మాజీ హోమ్ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం బెయిల్‌ను సవాలు చేస్తూ సిబిఐ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో నిందితుడైన చిదంబరానికి బెయిల్ మంజూరు చేయాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సిబిఐ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది.

అయితే ఈ పిటిషన్‌ను జస్టిస్ పి భానుమతి, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎఎస్ బోపన్న ధర్మాసనం కొట్టివేసింది. పిటిషన్ , దానికి సంబంధించిన పత్రాలను తాము పరిశీలించామని.. అందులో బెయిల్ ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని నమ్ముతున్నట్టు అభిప్రాయపడింది. అందువల్ల ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

అవినీతి కేసులో చిదంబరంను 21 ఆగస్టు 2019 న అరెస్టు చేశారు. వెంటనే, మనీలాండరింగ్ కేసులో ED కూడా అరెస్ట్ చేసింది. రెండు కేసుల్లోనూ బెయిల్ తర్వాత చిదంబరం జైలు నుంచి విడుదలయ్యారు. నిందితులు భారత్‌ను విడిచి పారిపోతారని దర్యాప్తు సంస్థ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దీని తరువాత, ఈడీ దాఖలు చేసిన కేసులో చిదంబరానికి డిసెంబర్‌లో బెయిల్ లభించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories