Congress: తమ బ్యాంకుల ఫ్రీజ్‌పై స్పందించిన కాంగ్రెస్

Congress Reacts To The Freeze Of Their Bank Account
x

Congress: తమ బ్యాంకుల ఫ్రీజ్‌పై స్పందించిన కాంగ్రెస్ 

Highlights

Congress: అసలు మా అకౌంట్స్‌లో అంత సుమ్ము లేదని ప్రకటించిన మాకెన్

Congress: రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలు కొద్దిసేపు ఫ్రీజ్‌ అయ్యాయి. ఐటీ శాఖ చర్యలతో ఇది జరగ్గా... దీనిపై హస్తం పార్టీ చట్టపరంగా చర్యలు తీసుకుంది. దాంతో ఆ ఖాతాలను ఐటీ విభాగం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ పునరుద్ధరించింది. ఈ వ్యవహారంపై వచ్చేవారం విచారణ జరిగేవరకు తాత్కాలిక ఊరట కొనసాగనుంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ప్రకటన చేశారు.

పార్టీ ఖాతాల్లో 115 కోట్లు ఉండేలా చూసుకోవాలని వేసిన పిటిషన్‌పై ఐటీ విభాగం, ఐటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ స్పందించాయి. దానికంటే ఎక్కువ మొత్తం ఆ ఖాతాల్లో ఉంటే.. మేం వినియోగించుకోవచ్చు. అంటే 115 కోట్లు ఫ్రీజ్‌ అయ్యాయని స్పష్టంగా తెలుస్తుంది. అంటే.. మా ఖాతాల్లో ఉన్న సొమ్ము కంటే ఇది చాలా ఎక్కువ అని మాకెన్‌ వెల్లడించారు.

ఐటీ విభాగం విధించిన పరిమితి మొత్తం తమ ఖాతాల్లో లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ ఖాతాలను ఫ్రీజ్‌ చేసిన వ్యవహారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్‌కు ఉన్నది డబ్బు బలం కాదని.. ప్రజాబలం.. అని అన్నారు. నియంతృత్వం ముందు మేం ఎన్నటికీ సాగిలపడబోమని స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేస్తారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories