బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు

Congress Protest Against BJP Govt
x

బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు

Highlights

* అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై దేశవ్యాప్త ఆందోళనలు

Congress: అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌ లోపల, బయట కాంగ్రెస్‌ ఆందోళనలు చేపట్టింది. జేపీసీ విచారణ కోసం పట్టుబడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉత్తరాఖండ్‌, చండీగఢ్‌లలో రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు కాంగ్రెస్‌ కార్యకర్తలు జెండాలు ఎగురవేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చండీఘడ్‌లో రాజ్‌భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. విడతల వారిగా పంజాబ్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, మరోవైపు హర్యానా కాంగ్రెస్‌ కార్యకర్తలు అదానీ వ్యవహారంపై ఆందోళన చేపట్టారు. జేపీసీ వేయడానికి కేంద్రం ఎందుకు భయపడుతోందని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. బారికేడ్లను తొలగించడానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు వాటర్‌కెనాన్లను ప్రయోగించారు. ఓ దశలో కాంగ్రెస్ నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories