Shashi Tharoor comments : కేంద్రప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. వలస కార్మికుల నుండి రైతు
Shashi Tharoor comments : కేంద్రప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. వలస కార్మికుల నుండి రైతు ఆత్మహత్యల వరకు ఇలా తాము ఏది అడిగిన డేటా లేదని అంటూ ప్రభుత్వం సమాధానం ఇస్తుందని అయన ఆరోపించారు. దీనితో ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం పైన అయన పలు విమర్శలు చేశారు. ఓ కార్టూన్‌ను ఆయన తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ... ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ కాదని 'నో డాటా అవైలవుబుల్' అంటూ ఎద్దేవా చేశారు.
ఇందులో మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షాలు 'నో డాటా అవైలబుల్' అనే ప్లకార్డులు పట్టుకున్నట్లుగా ఆ కార్టూన్ చూపిస్తుంది. వలస కూలీలపై డేటా లేదు, రైతు ఆత్మహత్యలపై సమాచారం లేదు, ఆర్థిక ప్యాకేజీలపై తప్పుడు ప్రచారం, కోవిడ్ మరణాలపై తప్పుడు లెక్కలను, జీడీపీ వృద్ధిపై నమ్మశక్యంలేని డేటాను ప్రభుత్వం చూపుతోందని శశిథరూర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
No #data on migrant workers, no data on farmer suicides, wrong data on fiscal stimulus, dubious data on #Covid deaths, cloudy data on GDP growth — this Government gives a whole new meaning to the term #NDA! pic.twitter.com/SDl0z4Hima
— Shashi Tharoor (@ShashiTharoor) September 22, 2020
దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలపై నమ్మకమైన సమాచారం తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పిన ఒక రోజు తర్వాత థరూర్ ఈ ట్వీట్ చేశారు. అయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక లాక్ డౌన్ సమయంలో ఎంతమంది వలసదారులు మరణించారో మోడీ ప్రభుత్వానికి తెలియదు ... ఎన్ని ఉద్యోగాలు పోయాయి. మీరు లెక్కించకపోతే ... ఎవరూ చనిపోలేదా? అని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అటు రైతు ఆత్మహత్యలకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రానికి సమాచారం ఇవ్వలేదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అందుకే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆత్మహత్యల వెనుక గల కారణాలను మనం వెల్లడించలేకపోతున్నామని సోమవారం రాజ్యసభలో స్పష్టం చేసింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire