ప్రశాంత్‌ కిషోర్‌తో మరో సీఎం ఒప్పందం!

ప్రశాంత్‌ కిషోర్‌తో మరో సీఎం ఒప్పందం!
x
Highlights

2022 మార్చ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేస్తోంది పార్టీ

2022 మార్చ్ లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకునే అవకాశం ఉంది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రశాంత్ కిశోర్ తో చర్చలు జరుపుతున్నారని, త్వరలో నిర్ణయం ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం కాకుండా ఎఐసిసి సీనియర్ నేత ఒకరు ప్రశాంత్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం ఈ కాంట్రాక్టు విషయంపై ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు. ఈ నెలాఖరుకల్లా దీనిపై స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇక రెండేళ్ల ముందుగానే ప్రశాంత్ కిషోర్ ను ఎంపిక చేసుకోవడం పార్టీకి లాభిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

2017 లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ చేసిన కృషి చాలానే ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ విజయానికి తీవ్రంగా కృషి చేశారాయన. దాదాపు 8 సార్లు ప్రతి నియోజకావర్గాన్ని సర్వే చేసి కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర వహించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ కు పనిచేయడానికి కిషోర్ వస్తున్నారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి, ఇప్పుడు ఇవి తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇదిలావుంటే బీహార్ సిఎం నితీష్ కుమార్‌తో విభేదించి బయటకు వచ్చిన కిషోర్ కొత్త రాజకీయ వేదిక కోసం వెతుకుతున్నట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్‌లో ప్రవేశం కోసం చూస్తున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories