Congress Vs Navya Haridas: ప్రియాంకా గాంధీపై కోర్టుకు నవ్య హరిదాస్.. స్పందించిన కాంగ్రెస్

Congress Vs Navya Haridas: ప్రియాంకా గాంధీపై కోర్టుకు నవ్య హరిదాస్.. స్పందించిన కాంగ్రెస్
x
Highlights

Congress Vs Navya Haridas: ప్రియాంకా గాంధీ ఎన్నికను సవాల్ చేస్తూ కేరళ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నవ్య హరిదాస్.. స్పందించిన కాంగ్రెస్

Navya Haridas's petition against Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపి అభ్యర్థి పిటిషన్.. స్పందించిన కాంగ్రెస్ కేరళలోని వయనాడ్‌లో ఇటీవల జరిగిన లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ 5 లక్షల పైగా మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

అయితే, ప్రియాంకా గాంధీ అఫిడవిట్ లో అన్ని వివరాలు పూర్తిగా పొందుపర్చనందున ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రియాంక చేతిలో ఓటమిపాలైన బీజేపి అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నవ్య హరిదాస్ పిటిషన్ పై తాజాగా కాంగ్రెస్ నేతలు స్పందించారు. నవ్య పిటిషన్ ను కేవలం చీప్ పబ్లిసిటీ స్టంట్ గా రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ అభివర్ణించారు. నవ్య పిటిషన్ ను కొట్టేయడమే కాదు... ఇలాంటి పిటిషన్ తో కోర్టు సమయం వృధా చేశారని కోర్టు జరిమానా కూడా విధిస్తుందని అన్నారు.

మరో నేత మాణికం ఠాగూర్ మాట్లాడుతూ... బీజేపికి పిటిషన్ వేసే హక్కు ఉంది కానీ సత్యం మాత్రం తమ వైపే ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories