Rahul Gandhi Fire : మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దేశవ్యాప్తంగా 33 లక్షలకు పైగా ప్రజలు కోవిడ్ బారినా పడిన వ్యాక్సిన్
Rahul Gandhi Fire : మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దేశవ్యాప్తంగా 33 లక్షలకు పైగా ప్రజలు కోవిడ్ బారినా పడిన వ్యాక్సిన్ విషయంలో ఆలస్యం చేయడం ఆందోళనకరంగా ఉంది అంటూ అయన వాఖ్యానించారు. ' వైరస్ కి వ్యాక్సిన్ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుంది, ధర, పంపిణీ విధానాలు తదితర అంశాలపై ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికే ఓ స్ర్టాటజీ అమల్లో ఉండాలి. కానీ అలాంటి సంకేతాలు లేవు" అని రాహుల్ ఫైర్ అయ్యారు.
A fair and inclusive Covid vaccine access strategy should have been in place by now.
— Rahul Gandhi (@RahulGandhi) August 27, 2020
But there are still no signs of it.
GOI's unpreparedness is alarming. https://t.co/AUjumgGjGC
ప్రస్తుతం భారత్ లో మూడు సంస్థలు టీకా తయారీలో ముందంజలో ఉన్నాయి.. ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా టీకా తయారీలో 3వ దశలో ఉండగా, భారత్ బయోటెక్, జైడుస్ కాడిలా తయారు చేస్తున్న టీకా మొదటి దశ ట్రయల్స్‌ను పూర్తిచేసుకుంది. అటు బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించి దేశంలో 3వ దశ ట్రయల్స్ ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 75,760 కేసులు నమోదు కాగా, 1023 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 56,013 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో కలిపి మొత్తం 33,10,234 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,25,991 ఉండగా, 25,23,771 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 60,472 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.24 శాతంగా ఉంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire