మన సైనికులను చంపడానికి చైనాకు ఎంత ధైర్యం? : రాహుల్ గాంధీ

మన సైనికులను చంపడానికి చైనాకు ఎంత ధైర్యం? : రాహుల్ గాంధీ
x
Highlights

భారత్‌-చైనా బలగాల మధ్య హింసాత్మక వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్ సైనికులు దాదాపు 20 మంది దాకా మరణించారు. అయితే ఈ సంఘటన విషయంలో స్పందించిన కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ..

భారత్‌-చైనా బలగాల మధ్య హింసాత్మక వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్ సైనికులు దాదాపు 20 మంది దాకా మరణించారు. అయితే ఈ సంఘటన విషయంలో స్పందించిన కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ.. ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీపై ప్రశ్నస్త్రాలు సంధించారు. ఈ విషయంలో మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. వారు ఈ విషయాన్ని ఎందుకు దాచారు? అయింది ఏదో అయింది.. ఇప్పుడైనా అక్కడ ఏమి జరిగిందో మనం తెలుసుకోవాలి? మన భూభాగానికి వచ్చి మన సైనికులను చంపడానికి చైనాకు ఎంత దైర్యం అని ప్రశ్నించారు.

కాగా సోమవారం రాత్రి లడఖ్‌లో చర్చలకు వెళ్లిన భారత సైనికులపై చైనా సైన్యం దాడి చేసింది. రాళ్ళు, కర్రలు, పదునైన ఆయుధాలు ఈ దాడిలో వాడారు. ఈ ఘటనలో భారత కమాండింగ్ ఆఫీసర్ సహా 20 మంది సైనికులు మరణించారు. దీనికి భారత్ కూడా గట్టి రిటార్ట్ ఇచ్చింది. భారత్ జరిపిన దాడిలో చైనాకు చెందిన 43 మంది మరణించారని సమాచారం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories