Priyanka Gandhi : దేశంలో మరో నిర్భయ ఘటనగా ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ హత్యాచార ఘటన మారింది. ఈ ఘటన పైన యూపీ ప్రభుత్వం పైన విపక్షాలు, వామపక్షాలు మండిపడుతున్నాయి..
Priyanka Gandhi : దేశంలో మరో నిర్భయ ఘటనగా ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ హత్యాచార ఘటన మారింది. ఈ ఘటన పైన యూపీ ప్రభుత్వం పైన విపక్షాలు, వామపక్షాలు మండిపడుతున్నాయి.. ఈ క్రమంలో భాదితురాలుకి న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని ప్రియాంకా గాంధీ తెలిపారు.. ఢిల్లీలోని వాల్మీకి ఆలయంలో నిర్వహించిన ప్రార్థన సమావేశానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. భాదితురాలుకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని, ఈ ఘటన పైన దేశామంతటా స్పందించాలని ఆమె కోరారు.
భాదితురాలి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రియాంక గాంధీవాల్మీకీ ఆశ్రమంలో ప్రార్ధనలు చేశారు. ఇక నిన్న(గురువారం) భాదితురాలి కుటుంబాన్ని పరమార్శించాలని భావించి గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నించిన ప్రియాంక, రాహుల్ గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రాహుల్ గాంధీని నెట్టడంతో ఆయన కింద పడ్డారు. యూపీ పోలీసులు వారిని తిరిగి ఢిల్లీకి తీసుకెళ్లారు.
Delhi: Congress leader Priyanka Gandhi Vadra attends the prayer meet for the victim of Hathras incident, at Maharishi Valmiki Temple pic.twitter.com/NmbHMpUhqn
— ANI (@ANI) October 2, 2020
అటు ప్రభుత్వం పైన నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. యూపీలో తల్లులు, సోదరుమనుల గురించి చెడు అలోచనలు వస్తేనే భయపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. భవిష్యత్తులో సైతం వారి పైన నేరలకి పాల్పడకుండా ఉండేలా శిక్షిస్తామని అన్నారు. ఆ శిక్ష భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోయేలా చేస్తామని అయన పేర్కొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire