భావ సారూప్య పార్టీలతో వెళ్లక తప్పదు.. ఉమ్మడి నిర్ణయాలతోనే ఫలితాలు - జీ-23

Congress G-23 Meeting Highlights | Congress Latest News
x

భావ సారూప్య పార్టీలతో వెళ్లక తప్పదు.. ఉమ్మడి నిర్ణయాలతోనే ఫలితాలు - జీ-23

Highlights

G-23 Meeting Highlights; గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ సోనియాతోనే - ఖర్గే

G-23 Meeting Highlights; వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వాలంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారాలంటే కాంగ్రెస్ భావ సారూప్య పార్టీలతో కలిసి నడవక తప్పదని జీ-23 నేతలు నిర్ణయానికి వచ్చారు. అలాంటి పార్టీలతో ఇప్పటి నుంచే సంప్రదింపులు, చర్చలు ప్రారంభించాలని కాంగ్రెస్ అధిష్ఠాన్ని డిమాండ్ చేశారు. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమిష్టి నాయకత్వంతో ముందుకు నడిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అన్ని స్థాయిల్లో ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇంట్లో సమావేశమైన జీ-23 నేతలు.. 2014లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వాలంటే అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్ లో అంతర్గతంగా చేయాల్సిన మార్పులపై చర్చించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి, సీడబ్ల్యూసీ సమావేశంలో నాయకత్వ మార్పు, సంస్కరణలపై ముందడుగు పడకపోవడం, పలువురు సీనియర్ నేతలు గాంధీ కుటుంబానికే విధేయత ప్రకటించిన నేపథ్యంలో జీ-23 నేతలు మళ్లీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉండగా.. గాంధీ కుటుంబం స్వయంగా కాంగ్రెస్ లో పదవుల నుంచి వైదొలగాలన్న కపిల్ సిబల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, అధీర్ రంజన్ చౌదురి మండిపడ్డారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, సిబల్ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనకు ఇవేమీ కనిపించలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories