Supreme Court: న్యాయమూర్తుల నియామాకానికి కొలీజియం సిఫారసు

Collegium Recommendation to Government on Judges Appointment
x

సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Supreme Court: 9 మంది న్యాయమూర్తుల నియామానికి ప్రభుత్వానికి సిఫార్సు

Supreme Court: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కొత్తగా జడ్జిల నియామకానికి కొలీజియం సిఫార్సు చేసింది. ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా 9 మంది పేర్లను కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు జడ్జిలుగా తెలంగాణ హైకోర్టు సీజే హిమ కోహ్లి, కర్ణాటక హైకోర్టు జడ్జ్ జస్టిస్ నాగరత్న, గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ త్రివేది.. మరికొంత మంది పేర్లను సిఫార్సు చేసింది. ఇందులో జస్టిస్ నాగరత్న సహా ముగ్గురికి భారత ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టే అవకాశం ఉంది. కొలీజియం లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూ యూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు..

తెలుగు వ్యక్తి ప్రముఖ న్యాయవాది పి.ఎస్. నరసింహా పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి కొలీజియం సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు.. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ పి.ఎస్. నరసింహ భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తి జస్టిస్ కోదండరామయ్య కొడుకే ఈ జస్టిస్ పి.ఎస్. నరసింహ.. ఆయన సంస్కృత భాషలో నిష్ణాతుడు..

సుప్రీంకోర్టు కొలీజియం 9మంది జడ్జిలను అత్యున్నత న్యాయస్థానానికి సిఫారసు చేసింది. 9మంది న్యాయమూర్తుల పేర్లను ప్రభుత్వానికి సిఫారస్సు చేసింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలో కొలీజయం సిఫార్సలు చేసింది. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్‌ విక్రమ్ నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహ ఉన్నారు.. వీరిలో తరువాత సీజేఐగా మహిళా అయ్యే అవకాశం ఉంది.. ముగ్గురు మహిళా జడ్జిల్లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ పేరు కూడా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories