Delhi: దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోన్న చలి.. 23 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటన

Cold Intensity In Delhi
x

Delhi: దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోన్న చలి.. 23 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటన

Highlights

Delhi: పలు ప్రాంతాల్లో దట్టంగా వ్యాపించిన పొగమంచు

Delhi: దేశరాజధాని ఢిల్లీని చలి పులి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో దట్టంగా పొగ మంచు కమ్ముకోవడంతో ప్రజారవాణాపై ప్రభావం పడుతోంది. ఎదురుగా ఉన్నవి కనిపించనంత.. దట్టమైన పొగ కారణంగా రైలు సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి. 23 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఢిల్లీనుంచి రాకపోకలు సాగించే పలు జాతీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం, జనవరి 5 తరువాత ఉత్తరాదిన చలి మరింత తీవ్రమవుతుందని తెలిపింది. జనవరి 11 వరకూ చలితో అవస్థలు తప్పవని ఐఎమ్‌డీ పేర్కొంది. పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత భారీగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories