CJI: తదుపరి సీజేఐగా జస్టిస్‌ యు.యు. లలిత్‌..!

CJI NV Ramana Recommends Justice UU Lalit as Next CJI
x

CJI: తదుపరి సీజేఐగా జస్టిస్‌ యు.యు. లలిత్‌..!

Highlights

Justice UU Lalit: తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్ పేరును చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు.

Justice UU Lalit: తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్ పేరును చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఈనెల 26న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి జస్టిస్ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్ పేరును ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. దీంతో భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌కు ఎన్నికైయే అవకాశం ఉంది.

సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఆ లెక్కన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తర్వాత జస్టిస్‌ యు.యు.లలిత్‌ అత్యంత సీనియర్‌గా ఉన్నారు. జస్టిస్‌ లలిత్‌ ఆగస్టు 27న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే, ఆయన పదవీ కాలం మూడు నెలల్లోపే ముగుస్తుంది. నవంబరు ఎనిమిదో తేదీన ఆయన పదవీ విరమణ చేస్తారు.


Show Full Article
Print Article
Next Story
More Stories