CJI: మా ఇంటికి ప్రధాన మంత్రి రావడంలో తప్పేముంది.. దుష్ప్రచారం తగదు.. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందన

CJI: మా ఇంటికి ప్రధాన మంత్రి రావడంలో తప్పేముంది.. దుష్ప్రచారం తగదు.. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందన
x
Highlights

CJI: గణపతి పూజ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఇంటికి రావడంలో ఎలాంటి తప్పులేదన్నారు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్. ఇలాంటి విషయాలపై రాజకీయరంగంలో...

CJI: గణపతి పూజ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఇంటికి రావడంలో ఎలాంటి తప్పులేదన్నారు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్. ఇలాంటి విషయాలపై రాజకీయరంగంలో పరిణితి ఉండాలన్నారు. న్యాయమూర్తులను అనుమానించడం అంటే వ్యవస్థ పరువు తీయడమే అంటూ చురకలంటించారు.

ఓ ఆంగ్ల దినపత్రిక కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ..వినాయకుడి పూజ కోసం ప్రధాని నరేంద్రమోదీ మా ఇంటికి వచ్చారు. ఇందులో తప్పు ఏమీ లేదు. ఎందుకంటే సామాజిక స్థాయిలో న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహకుల మధ్య సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. మేము రాష్ట్రపతి భవన్ లో, గణతంత్ర దినోత్సవం మొదలైన కార్యక్రమాల్లో కలుస్తూనే ఉంటాము. ప్రధాని, మంత్రులతో మాట్లాడతుంటాము. ఈ సంభాషణలో మనం నిర్ణయించుకునే విషయాలు కాదు, జీవితం, సమాజం గురించిన సాధారణ సంభాషణలు ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

పటిష్టమైన ఇంటర్-ఇన్‌స్టిట్యూషనల్ మెకానిజంలో భాగంగా పరస్పరం గౌరవించుకోవాలని.. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాల విభజన అంటే రెండూ కలవలేవని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అధికార విభజన అంటే న్యాయవ్యవస్థ విధి విధానాలను రూపొందించే కార్యనిర్వాహక పాత్రను పోషించకూడదు. ఎందుకంటే విధానాలను రూపొందించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.

అయోధ్యలో రామమందిరం సమస్య పరిష్కారం కోసం దేవుడిని ప్రార్థించానని తన ప్రకటనపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. తాను విశ్వాసం ఉన్న వ్యక్తినని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని అన్నారు. 2018లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాపై నలుగురు న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేసినపుడు, సంస్థాగత క్రమశిక్షణను కొనసాగించాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గురించి మాట్లాడుతూ.. అతను ప్రశాంతమైన వ్యక్తని.. తీవ్రమైన సమస్యలు ఉన్న సమయంలో కూడా తన ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories