Kedarnath: కేదార్‌నాథ్‌లో MI-17 హెలికాప్టర్ కూలిపోయిన అసలు కారణం ఇదే..!

Chopper Airlifted By MI-17 Crashed In Kedarnath Check Here Full Details
x

Kedarnath: కేదార్‌నాథ్‌లో MI-17 హెలికాప్టర్ కూలిపోయిన అసలు కారణం ఇదే..!

Highlights

Helicopter Crash in Kedarnath: కెస్ట్రెల్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ నుంచి గౌచర్‌కు తీసుకువెళ్తున్న సమయంలో కూలిపోయింది.

Helicopter Crash in Kedarnath: కెస్ట్రెల్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ నుంచి గౌచర్‌కు తీసుకువెళ్తున్న సమయంలో కూలిపోయింది. క్రిస్టల్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ లించోలిలోని మందాకిని నది సమీపంలో ఈ రోజు ఉదయం కుప్పకూలింది.

కేదార్‌నాథ్ నుంచి హెలికాప్టర్‌ను శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కూల్చివేయాల్సి వచ్చింది. కెస్ట్రెల్ ఏవియేషన్‌కు చెందిన ఈ హెలికాప్టర్‌ను MI-17 ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ చేయడం కోసం ఎయిర్‌లిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నారు.

ఎయిర్‌లిఫ్ట్ సమయంలో, బలమైన గాలి కారణంగా MI-17 దాని బ్యాలెన్స్ కోల్పోయింది. ఆ తర్వాత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున పైలట్ దానిని సురక్షిత ప్రదేశంలో పడేశాడు.

హెలికాప్టర్ గాలి, బరువు కారణంగా ఎంఐ-17 బ్యాలెన్స్ తప్పిపోయిందని జిల్లా టూరిజం అధికారి రాహుల్ చౌబే తెలిపారు. దీని తర్వాత పైలట్ హెలికాప్టర్‌ను థారు క్యాంప్ లోయలోని ఖాళీ ప్రదేశంలో పడేశాడు. ఇక్కడ జనాభా ఎవరూ లేరని తెలిపారు.

జారవిడిచిన కెస్ట్రెల్ ఏవియేషన్ హెలికాప్టర్ మే 24న కేదార్‌నాథ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పటి నుంచి హెలిప్యాడ్‌పైనే ఉంది. మరమ్మతుల కోసం ఈ ఉదయం గౌచర్ ఎయిర్‌బేస్‌కు తీసుకెళ్తున్నారు.

కెస్ట్రెల్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ మే 24న తమిళనాడు నుంచి ఆరుగురు ప్రయాణికులతో కేదార్‌నాథ్‌కు వెళుతోంది. దానిని కెప్టెన్ కల్పేష్ నడుపుతున్నాడు. హెలిప్యాడ్‌కు 100 మీటర్ల ముందు బ్యాలెన్స్ కోల్పోయింది. గాలిలో 8 సార్లు పల్టీలు కొట్టిన తర్వాత అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇది కేదార్‌నాథ్‌లో 3 నెలలుగా అలాగే ఉండిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories