China: మా దేశం నుంచి వెళ్లిపోండి.. భారత జర్నలిస్టుకు చైనా ఆదేశం

China Tells Last Indian Journalist to Leave This Month
x

China: మా దేశం నుంచి వెళ్లిపోండి.. భారత జర్నలిస్టుకు చైనా ఆదేశం

Highlights

Indian Reporter: భారత్, డ్రాగన్ కంట్రీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా ముదురుతున్నాయి.

Indian Reporter: భారత్, డ్రాగన్ కంట్రీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా ముదురుతున్నాయి. సరిహద్దులో నిత్యం చైనా ఘర్షణలకు దిగుతోంది. తాజాగా చైనాలో ఉన్న ఒకే ఒక జర్నలిస్టును దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బీజింగ్‌లో ఉన్నది కేవలం ప్రెస్ ట్రస్ట్‌ ఆఫ్ ఇండియా-పీటీఐ రిపోర్టరు మాత్రమే. అతడిని కూడా ఈ నెలాఖరులోగా వెళ్లిపోవాలని బీజింగ్ అల్టిమేటం ఇచ్చింది. పీటీఐ జర్నలిస్టు కూడా వచ్చేస్తే.. ఇక చైనాలో భారత మీడియా ప్రతినిధుల ప్రస్థానం ముగిసినట్టవుతుంది. భారత మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు ఈ ఏడాది ప్రారంభంలో నలుగురు ఉన్నారు. జనవరి మొదటి వారం తరువాత.. హిందూస్థాన్ టైమ్స్‌కు చెందిన జర్నలిస్టు వీసాను బీజింగ్‌ రెన్యూవల్ చేయలేదు. దీంతో ఈ జర్నలిస్టు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ తరువాత.. భారత ప్రభుత్వ మీడియా సంస్థ ప్రసార భారతి, ది హిందూకు చెందిన జర్నలిస్టుల వీసాల గడువు ఏప్రిల్‌తో ముగిసింది. బీజింగ్ రెన్యూవల్ చేయకపోవడంతో.. ఆ ఇద్దరు కూడా వెనక్కి వచ్చారు. కొన్నాళ్లుగా భారత జర్నలిస్టుల వీసాలను రెన్యూవల్‌ చేసేందుకు బీజింగ్‌ నిరాకరిస్తోంది. ఈ క్రమంలో భారత్‌ కూడా చైనా జర్నలిస్టుల వీసాలను రెన్యువల్ చేసేది లేదని తేల్చి చెప్పింది.

భారత్‌లోనూ చైనా చెందిన జర్నలిస్టు ఒక్కరే మిగిలారు. అతడు కూడా వీసా పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా భారతీయ జర్నలిస్టుకు బీజింగ్ వీసా రెన్యూవల్‌ చేయడానికి నిరాకరించింది. దీంతో భారత్‌ కూడా చైనా జర్నలిస్టు వీసాను పునరుద్ధరించేది అనుమానమే. అంతకుమందు చైనాకుచెందిన జిన్హువా న్యూస్ ఏజెన్సీ, చైనా సెంట్రల్‌ టెలివిజన్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులు వీసాల రెన్యూవల్‌ను ఢిల్లీ తిరస్కరించింది. భారత్‌లో చైనా జర్నలిస్టులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కర్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కానీ.. చైనాలో మాత్రం భారతీయ జర్నలిస్టులకు అడుగడుగున ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఈ విషయమే ఈనెల ప్రారంభంలోనే భారత్‌ దీనిపై స్పందించింది. సమస్యపై ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు ఢిల్లీ తెలిపింది. అయితే భారతీయ జర్నలిస్టులు చైనాలో సహాయకులను నియమించుకోవాలని బీజింగ్‌ ఆదేశించింది. అందుకు భారతీయ జర్నలిస్టులు నిరాకరించారు. దీంతో అక్కడి నుంచే వివాదం మొదలైంది. సహాయకుల విషయంలోనే డ్రాగన్ కంట్రీ వీసాల రెన్యూవల్ విషయంలో పేచీ పెడుతోంది. ఈ విషయంలో భారత్‌ కూడా చైనాకు దీటుగా స్పందించింది.

గాల్వన్ లోయలో భారత్‌లో చొచ్చుకు వచ్చేందుకు యత్నించిన చైనా బలగాలను ఆర్మీ అడ్డుకుంది. ఈ ఘర్షణ నుంచి ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో చైనాతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను భారత్‌ తెంచుకుంటోంది. సరిహద్దులో సమస్య పరిష్కారం అయ్యేవరకు వాటిని పునరుద్ధరించేది లేదని ఢిల్లీ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జరిగే జీ-20, షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులకు ఢిల్లీ ఆతిథ్యమిస్తోంది. అంతర్జాతీయంగా తన దౌత్య, రాజకీయ ఉనికిని పెంపొందించుకోవాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో జరిగే జీ-20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య వివాదాలు మరింత తీవ్రమవుతున్నాయి. నిజానికి చైనా భారత జర్నలిస్టుల విషయంలోనే కాదు.. అమెరికాతోనూ డ్రాగన్‌కు కొన్నేళ్లుగా ఇదే వివాదం నడుస్తోంది. ట్రంప్‌ హయాంలో.. చైనా జర్నలిస్టుల సంఖ్యను పరిమితం చేసింది. దీంతో బీజింగ్‌ అమెరికా మీడియా కంపెనీల ప్రతినిధులకు అనుమతిని రద్దు చేసింది. 2020లో చైనా, ఆస్ట్రేలియా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దీంతో బీజింగ్‌లో ఉన్న ఇద్దరు ఆస్ట్రేలియా జర్నలిస్టులను కూడా చైనా వెళ్లగొట్టింది. దీనికి ప్రతీకారంగా.. కాన్‌బెర్రాలో చైనా ప్రభుత్వ మీడియా, సిబ్బంది ఇళ్లపై ఆస్ట్రేలియా ప్రభుత్వం దాడులు నిర్వహించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories