లడఖ్‌లో భారత సైనికులను గందరగోళానికి గురిచేయడానికి చైనా ముతక ఐడియా..

లడఖ్‌లో భారత సైనికులను గందరగోళానికి గురిచేయడానికి చైనా ముతక ఐడియా..
x
Highlights

లడఖ్‌లోని సరిహద్దులో భారత సైనికులను గందరగోళానికి గురిచేయడానికి డ్రాగన్ కంట్రీ మరో పాచిక వేసింది. లౌడ్‌స్పీకర్లను పెట్టి పంజాబీ పాటలు ప్లే చేసింది. ఈ విషయాన్నీ వార్తా సంస్థ ఎఎన్‌ఐ..

లడఖ్‌లోని సరిహద్దులో భారత సైనికులను గందరగోళానికి గురిచేయడానికి డ్రాగన్ కంట్రీ మరో పాచిక వేసింది. లౌడ్‌స్పీకర్లను పెట్టి పంజాబీ పాటలు ప్లే చేసింది. ఈ విషయాన్నీ వార్తా సంస్థ ఎఎన్‌ఐ పేర్కొంది, ఫింగర్ -4 ప్రాంతంలో 24 గంటల పాటు చైనా లౌడ్‌స్పీకర్లతో పాటలు ప్లే చేసిందిందని తెలిపింది. చైనా తాజా ఎత్తుగడలో కుట్ర కారణాలే ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.. సరిహద్దులో భారతీయ సైనికుల దృష్టిని మరల్చడానికి ఇలా పాటలు ప్లే చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు చైనా సైన్యం మాత్రం పాటల ద్వారా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని నాటకం ఆడుతోంది.. ఇరుదేశాల మధ్య శాంతిని కోరుకునే దేశం అయితే పూటకో రకంగా భారత సైనికులను గిల్లడం ఎందుకు అనే ప్రశ్న రాకమానదు.. ప్రస్తుతం పాంగోంగ్ సరస్సు వద్ద అన్ని విధాలుగా భారత సైన్యం బలంగా ఉంది. దాదాపు ఎత్తైన పర్వతాలు అన్నింటిలో భారత దళాలు మోహరించాయి. దీంతో చైనాకు మరో మార్గం లేకుండా పోయింది.

ఈ క్రమంలోనే ఇలాంటి ముతక ఐడియాలతో భారత సైనికుల దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తోంది. ఇదిలావుంటే తూర్పు లడఖ్‌లో గత 20 రోజుల్లో భారత్-చైనా సైనికులు 3 సార్లు గాలిలోకి కాల్పులు జరిపారు, చివరిసారిగా సెప్టెంబర్ 8 న, రెండు వైపుల నుండి 100–200 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తరువాత సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. తూర్పు లడఖ్‌లో చైనాతో ఉద్రిక్తతలు పెరగడంతో బోఫోర్స్ ఫిరంగులను మోహరించడానికి భారత సైన్యం సిద్ధమైంది. ఈ ఫిరంగులుతో 1999 లో పాకిస్థాన్‌పై జరిగిన కార్గిల్ యుద్ధంలో విజయం సాధించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories