CJI NV Ramana: టీటీడీలో తప్పులు జరిగితే శ్రీవారు ఉపేక్షించరు

Chief Justice of India NV Ramana Interesting Comments on TTD Case Trail
x

టీటీడీ కేసు విచారణలో సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు(ఫోటో: లైవ్ లా)

Highlights

* కేసు విచారణలో భాగంగా తెలుగులో మాట్లాడిన సీజేఐ ఎన్వీ రమణ

Supreme Court: టీటీడీ కేసు విచారణలో సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరిని ఉపేక్షించరని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణ సమయంలో సీజేఐ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడారు. తాను కూడా వేంకటేశ్వర స్వామి భక్తుడినని తెలిపారు.

అయితే పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఏమైనా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు వారం లోగా సమాధానం ఇవ్వాలని టీటీడీ లాయర్‌కు ధర్మాసనం అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories