Chhota Rajan: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి

Chhota Rajan Passes Away Due to the Covid19
x

చోట రాజన్ (ఫైల్ ఫోటో)

Highlights

Chhota Rajan: ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి * తీహార్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న చోటా రాజన్

Chhota Rajan: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి చెందారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న చోటారాజన్.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ క్రితం మృతి చెందారు. తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న చోటా రాజన్‌కు కరోనా సోకడంతో జైలు అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఇవాళ చోటా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.

మరోవైపు.. 70కు పైగా క్రిమినల్ కేసులున్న చోటా రాజన్‌ను 2015లో ఇండోనేషియా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు సీబీఐ అధికారులు. చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ కాగా.. తొలుత చోటా రాజన్ దావూద్ గ్యాంగ్‌లో ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. ఆ తర్వాత విభేదాల కారణంగా మరో గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న చోటా రాజన్.. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. 70కు పైగా క్రిమినల్ కేసులున్న చోటా రాజన్‌కు ఓ జర్నలిస్ట్ మర్డర్ కేసులో జీవిత ఖైదు పడింది.

సుమారు రెండు దశాబ్దాలుగా భార‌తో పాటు అనేక ప్రపంచ దేశాలకు దొరక్కకుండా తన క్రిమినల్ కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చిన ఛోటా రాజన్‌‌ను.. ఇంటర్ పోల్ సమాచారంతో 2015లో అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు అతడిని ఇంటర్‌పోల్ వర్గాలు ఇండోనేషియాలోని బాలిలో అరెస్టు చేశారు. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సహచరుడైన ఛోటా రాజన్.. ఆ తర్వాత అతడికి గట్టి ప్రత్యర్థిగా మారాడు. ముంబై పోలీసులు, భారత నిఘా ఏజెన్సీలు దాదాపు రెండు దశాబ్దాలు పాటు అన్వేషణ సాగించారు. 1995 నుంచి తప్పించుకున్న ఛోటా రాజన్.. ముంబైలోని నేర సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories