ప్రేమించుకుంటున్నారని అన్నాచెల్లెల్ల హత్య..! ఆపై..

ప్రేమించుకుంటున్నారని అన్నాచెల్లెల్ల హత్య..! ఆపై..
x
Highlights

ఛత్తీస్‌గడ్ ‌లో దారుణం జరిగింది. ప్రేమించుకుంటున్నారని 21 ఏళ్ల యువకుడు మరియు అతని కజిన్ సోదరిని వారి ఇద్దరు కుటుంబ సభ్యులే హత్య చేశారు. ఈ ఘటన దుర్గ్ జిల్లాలో వెలుగులోకి..

ఛత్తీస్‌గడ్ ‌లో దారుణం జరిగింది. ప్రేమించుకుంటున్నారని 21 ఏళ్ల యువకుడు మరియు అతని కజిన్ సోదరిని వారి ఇద్దరు కుటుంబ సభ్యులే హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన దుర్గ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. దుర్గ్ జిల్లాలోని కృష్ణనగర్‌కు చెందిన శ్రీహరి, అతని కజిన్ సోదరి ఐశ్వర్య (20) అనే యువతీయువకుడికి విషం ఇచ్చి హత్యచేసి అనంతరం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులు శనివారం దహనం చేసినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు వార్తా సంస్థ పిటిఐ నివేదికలో తెలిపారు. ఈ నేరానికి పాల్పడింది.. శ్రీహరి మామ రాము, ఐశ్వర్య సోదరుడు చరణ్‌గా భావించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు భిలై నగర్ నగర పోలీసు సూపరింటెండెంట్ (సిఎస్‌పి) అజిత్ యాదవ్ తెలిపారు. కృష్ణ నగర్లో శ్రీహరి, ఐశ్వర్య ఇళ్ళు పక్కపక్కనే ఉన్నాయి.. వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. అయితే గతనెల తమ ఇళ్ళనుండి పారిపోయారు, దాంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని సిఎస్‌పి పేర్కొన్నారు.

అయితే వారు చెన్నైలో ఉంటున్నారని గుర్తించిన దుర్గ్ పోలీసులు అక్కడికి ఒక బృందాన్ని పంపారు. అక్టోబర్ 7 న వీరిని తిరిగి దుర్గ్‌కు తీసుకువచ్చి చట్టబద్ధంగా సదరు కుటుంబాలకు అప్పగించామని చెప్పారు. అయితే శనివారం రాత్రి, పోలీసు పెట్రోలింగ్ బృందం వారి ఇళ్లలో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించి, విచారణ కోసం లోపలికి వెళ్ళిందని.. ఈ సమయంలో ఇద్దరు నిందితులు బాధితులకు విషం ఇచ్చి హత్య చేసినట్టు అంగీకరించారని సిఎస్‌పి తెలిపారు. మృతదేహాలను జెవ్రా సిర్సా గ్రామానికి సమీపంలో ఉన్న శివనాథ్ నది ఒడ్డున తగలబెట్టినట్లు ఇద్దరు నిందితులు వెల్లడించినట్లు చెప్పారు. మరోవైపు నిందితుల వెల్లడించిన వివరాల ప్రకారం యువతియువకుడు అన్నాచెల్లు అవుతారు.. వారు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇది తమకు ఇష్టం లేదని విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. కాగా పాక్షికంగా కాలిపోయిన మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సిఎస్‌పి అజిత్ యాదవ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories