Online Liquor: మందుబాబుల‌కు గుడ్ న్యూస్...మద్యం హోమ్ డెలివరీకి స‌ర్కార్ అనుమతి

Liquor home Delivery Allowed Through Online From May 10th
x

Representational Image

Highlights

Chhattisgarh LockDown: మద్యాన్ని హోమ్ డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

Online Liquor: చత్తీస్ గఢ్ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. క‌రో్నా వైర‌స్ క‌ట్ట‌డిలో భాగంగా చత్తీస్ ఘ‌డ్ ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. మ‌ధ్యం దుకాణాలు మూసివుండ‌డంతో ముందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. ఈ నేపంథ్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కిక్కెక్కించే వార్తను అందించింది. మద్యాన్ని హోమ్ డెలివరీకి ప్ర‌భుత్వం అనుమ‌తించింది.

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో మద్యం షాపులు మూతపడ్డాయి. ఈ క్రమంలో, మద్యాన్ని హోమ్ డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. మద్యం లేకపోవడంతో కల్తీ మద్యం తయారీ అవుతోందని, అధికారులు దాన్ని తాము అడ్డుకోవడంతో మ‌ద్యం ప్రీయులు శానిటైజర్లు తాగి చనిపోతున్నారని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. అందుకే మద్యాన్ని హోమ్ డెలివరీ చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని చెప్పారు.

చత్తీస్ గఢ్ లో ఈ రోజు నుంచి మద్యం హోమ్ డెలివరీ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హోమ్ డెలివరీ ఉంటుందని సదరు అధికారి తెలిపారు. ఆన్ లైన్లో ఆర్డర్ చేసి, డబ్బులు చెల్లిస్తే సమీపంలోని వైన్ షాపు నుంచి మద్యాన్ని డెలివరీ చేస్తారని చత్తీస్ గఢ్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ముందుబాబులు సంతోషం వ్య‌క్తం చే్స్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories