Chandrayaan 3: మరో మైలురాయికి చేరుకున్న చంద్రయాన్ -3.. విజయవంతంగా జాబిల్లి కక్ష్యలోకి..

Chandrayaan-3 Mission The Spacecraft Entered Lunar Orbit
x

Chandrayaan 3: మరో మైలురాయికి చేరుకున్న చంద్రయాన్ -3.. విజయవంతంగా జాబిల్లి కక్ష్యలోకి..

Highlights

Chandrayaan 3: జాబిల్లి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-3 తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

Chandrayaan 3: జాబిల్లి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-3 తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. భూకక్ష్యను దాటుకుంది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావంలోకి పంపించడానికి చంద్రాయన్ 3 కక్ష్యను మరింత పెంచింది ఇస్రో. ఈ సాయంత్రం సరిగ్గా 6:59 నిమిషాలకు చంద్రుడి ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. ఇప్పటి నుంచి చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది.

‘చంద్రయాన్‌-3’ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ఆగస్టు 1న ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే శనివారం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యోమనౌక తన ప్రయాణంలో మూడింట రెండొంతులు ఇప్పటికే పూర్తి చేసుకుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెట్టనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories