Chandrayaan-3: తొలి ఫలితాన్ని ప్రకటించిన ఇస్రో.. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలను పంపిన రోవర్‌

Chandrayaan 3 First Finding About Moon Soil Temperature Is Out
x

Chandrayaan-3: తొలి ఫలితాన్ని ప్రకటించిన ఇస్రో.. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలను పంపిన రోవర్‌

Highlights

Chandrayaan-3: 10 సెంటీమీటర్ల లోతులో -10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత

Chandrayaan-3: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం నుంచి తొలి అప్‌డేట్‌ వచ్చేసింది. ఉపరితలంపై పరిశోధనలు చేస్తోన్న ప్రగ్యాన్ రోవర్ నుంచి కీలక అప్‌డేట్‌ అందింది. చంద్రుడిపై నమోదవుతోన్న వివిధ రకాల ఉష్ణోగ్రతలను ఇస్రోకు చేరవేసింది ప్రగ్యాన్ రోవర్‌. ఉపరితలం నుంచి పది సెంటీమీటర్ల లోతు వరకు టెంపరేచర్లు అబ్జర్వ్ చేయగా.. అందుకు సంబంధించిన గ్రాఫ్‌ను విడుదల చేసింది ఇస్రో. చంద్రుడి ఉపరితలంపై 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌‌కు పైగా ఉష్ణోగ్రత నమోదవగా.. ఉపరితలం నుంచి 10 సెంటీమీటర్ల లోతులో మైనస్ పది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తోంది. తాజా అప్‌డేట్‌తో చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు మార్గం సుగమమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories