జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్‌-3

Chandrayaan 3 Closer To Moon
x

జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్‌-3

Highlights

Chandrayaan-3: దక్షిణ ధ్రువానికి 174×1437 కి.మీ.లో మరో కక్ష్యలోకి చంద్రయాన్-3

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్ 3 జాబిలికి మరింత చేరువైంది. అత్యంత సమీపంలో జాబిలి దక్షిణ ధృవం వైపు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. ఈనెల 14న మరింత చేరువగా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

జులై 14న చంద్రయాన్‌ను విజయవంతంగా స్పేస్‌లోకి పంపిన ఇస్రో.. కొద్దిరోజులుగా దశలవారీగా కక్ష్యను పెంచుతూ వస్తున్నారు. ఆగస్టు 5న చంద్రయాన్ 3.. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈనెల 16న చంద్రుడికి వంద కిలోమీటర్ల చేరువకు చంద్రయాన్‌ను చేర్చేందుకు చివర ఆపరేషన్ చేపడతామని తెలిపారు. ఆ మరుసటి రోజే ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్‌ను ఆర్బిటార్ నుంచి వేరు చేస్తామని ఇస్రో పేర్కొంది. ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ సెపరేషన్ అయిపోగానే వెంటనే ల్యాండర్ వేగాన్ని తగ్గించనున్నారు.ఆ తర్వాత ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్‌ చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఈనెల 23న విక్రమ్ ల్యాండర్‌ను మూన్‌పై ల్యాండ్ చేయనున్నారు.

ఇక విక్రమ్‌ ల్యాండింగ్‌పై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ కీలక ప్రకటన చేశారు. ల్యాండర్ విక్రమ్‌‌ను ఫెయిల్యూర్ విధానంలో రూపొందించామన్నారు. ల్యాండర్ విక్రమ్.. అన్ని సెన్సార్లు, ఇంజిన్లు పనిచేయకపోయినా.. ప్రొపల్షన్ సిస్టమ్ బాగా పనిచేస్తే సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories