chandipura virus Death: ఛండీపూర్ వైరస్‎తో తొలి మరణం..నాలుగేళ్ల బాలిక మృతి

Chandipurs first death due to virus..a four-year-old girl died
x

chandipura virus Death : ఛండీపూర్ వైరస్‎తో తొలి మరణం..నాలుగేళ్ల బాలిక మృతి

Highlights

chandipura virus Death :భారత్ లోఛండీపూర్ వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ సోకి గుజరాత్ లో నాలుగేళ్ల బాలిక మరణించిందని అధికారులు తెలిపారు. ఆ వైరస్ కారణంగా నమోదు అయిన తొలి మరణం ఇదేనని వెల్లడించారు.

chandipura virus Death : భారత్ లో ఛండీపురా వైరస్ విజృంభిస్తోంది. ఛండీపూర వైరస్ చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంటుంది. తాజాగా గుజరాత్ లోని నాలుగేళ్ల బాలిక ఈ వైరస్ సోకి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ వైరస్ కారణంగా నమోదు అయిన తొలిమరణం ఇదేనని వెల్లడించారు. నాలుగేళ్ల బాలిక నమూనాలకు పరీక్షించిన పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థ ఆమెకు వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు గుజరాత్ లో 29 మందికి ఈ వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. అయితే వారిలో 14 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వారి నమూనాలను ఎన్ఐవీకి పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడు వాపు వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు చెబుతున్నారు.

ఈ వైరస్ లక్షణాలు ఏమిటి?

చండీపురా వైరస్ సోకితే.. అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది. ఆ తర్వాత మూర్ఛ, అతిసారం, వాంతులకు కారణమౌతుంది. చివరికి మరణానికి దారితీయవచ్చు. ఈ వైరస్ సోకిన పిల్లలు లక్షణాలు కనిపించిన 48-72 గంటల్లో మరణిస్తున్నట్లు సమాచారం. చాలా మంది రోగుల మరణానికి కారణం ఎన్సెఫాలిటిస్, ఇది మెదడు కణజాలం క్రియాశీల వాపుగా గుర్తించారు. జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ అండ్ డెంటల్ సైన్స్ నివేదిక ప్రకారం,'చండీపురా వైరస్ మరొక అన్యదేశ ఉష్ణమండల వ్యాధి. సాండ్‌ఫ్లై లేదా డ్రెయిన్ ఫ్లై ఈ వైరస్ ముఖ్యమైన క్యారియర్‌గా పరిగణిస్తారు. ఈ CHPV దోమలకు కూడా సోకుతుంది.

చికిత్స,నివారణ:

చండీపురా వైరస్‌కు నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదు. అత్యవసర చికిత్స లక్ష్యం ఏదైనా దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యలను నివారించడానికి అవసరమైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల న్యూరాన్లు లేదా నరాల కణాలను రక్షించడం.

చండీపురా వైరస్ అంటే ఏమిటి?

ఏప్రిల్, జూన్ 1965 మధ్య మనదేశంలో నాగ్ పూర్ లో తొలికేసు నమోదైంది. పూణే వైరస్ పరిశోధనా కేంద్రానికి చెందిన ప్రవీణ్ ఎన్ భట్, ఎఫ్ఎమ్ రోడ్రిగ్స్ 1967లో విడుదల చేసిన పరిశోధనా పత్రంలో చండీపురా వైరస్‌ను ఆర్బోవైరస్ (ఆర్థ్రోపోడ్ వెక్టర్స్ ద్వారా సంక్రమించే వైరస్)గా వర్గీకరించారు. భట్ రోడ్రిగ్స్ తెలిపిన వివరాల ప్రకారం వైరస్ సంక్రమణ ఫలితంగా హోస్ట్ సెల్‌లో నిర్మాణాత్మక మార్పులకు కారణమయ్యే కొన్ని క్షీరద వైరస్లలో ఈ వైరస్ ఒకటిగా పరిగణిస్తుందని తెలిపారు. ఈ వైరస్ శిశువులకు ప్రాణాంతకం అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories