ఇవాళ జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం

Champai Soren to take oath as Jharkhand CM
x

ఇవాళ జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం

Highlights

Jharkhand: ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించిన గవర్నర్ రాధాకృష్ణన్‌

Jharkhand: జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత జార్ఖండ్ శాసనసభ పక్ష నేతగా సీనియర్ ఎమ్మెల్యే చంపై సొరెన్‌ను JMM ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో JMM ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చంపై సోరెన్‌ సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు రాజ్‌భవన్‌కు వెళ్లిన చంపై సోరెన్‌.. గురువారం కూడా మరోసారి గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. జేఎంఎం సభ్యుల వినతికి గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇక జార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్‌ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనుండగా.. పదిరోజుల్లో అసెంబ్లీలో బల పరీక్ష ఉండనుంది. మరోవైపు రాష్ట్రంలో సోరెన్ రాజీనామాతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రతిపక్ష బీజేపీ ఎక్కడ తమ ఎమ్మెల్యేలను వారి వైపు తిప్పుకుంటుందనే ఆందోళనలో JMM, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. దీంతో తమ ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. నేడో, రేపో ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories