జార్ఖండ్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంపై సోరెన్‌

Champai Soren takes oath as chief minister
x

జార్ఖండ్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంపై సోరెన్‌

Highlights

Champai Soren: చంపై సోరెన్‌తో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌

Champai Soren: జార్ఖండ్‌‌ సీఎంగా చంపై సోరెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాధాకృష్ణన్‌ చంపై సోరెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. చంపై సోరెన్‌ ప్రమాణం అనంతరం డిప్యూటీ సీఎంలుగా ఆలంగిర్‌ ఆలం, బసంత్‌ సోరెన్‌... మంత్రిగా సత్యానంద్‌ భుక్తా ప్రమాణస్వీకారం చేశారు. చంపై సోరెన్ ప్రభుత్వానికి కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీలు మద్దతిచ్చాయి.

అయితే హేమంత్ సోరెన్ రాజీనామా అనంతరం చంపై సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా.. బలనిరూపణకు 10 రోజుల సమయం ఇచ్చారు గవర్నర్. ప్రతిపక్ష బీజేపీ ఎక్కడ తమ ఎమ్మెల్యేలను వారి వైపు తిప్పుకుంటుందనే ఆందోళనలో JMM, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. దీంతో తమ ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. 39 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బలనిరూపణ జరిగే వరకు ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories